చిప్స్‌ ప్యాకెట్‌లో ఆలుగడ్డ.. కస్టమర్‌కు ఆ సంస్థ ఏం చెప్పిందంటే..!

Man opens bag of chips finds a whole potato. బ్రిటన్‌లో చిప్స్‌ తిందామనుకున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. దగ్గర్లోని ఓ షాపుకు వెళ్లి కెటిల్‌ చిప్స్‌ ప్యాకెట్‌ కొనుక్కున్నాడు.

By అంజి  Published on  21 Oct 2021 10:02 AM IST
చిప్స్‌ ప్యాకెట్‌లో ఆలుగడ్డ.. కస్టమర్‌కు ఆ సంస్థ ఏం చెప్పిందంటే..!

బ్రిటన్‌లో చిప్స్‌ తిందామనుకున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. దగ్గర్లోని ఓ షాపుకు వెళ్లి కెటిల్‌ చిప్స్‌ ప్యాకెట్‌ కొనుక్కున్నాడు. ఆ తర్వాత దాన్ని ఓపెన్‌ చేశాడు. అయితే అందులో చిప్స్‌కు బదులుగా ఆలుగడ్డ ఉంది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఈ నెల 17న లింకన్‌షైర్‌లోని ఉప్పింగ్‌హామ్‌ స్కూల్‌లో ఫిజిక్స్‌ టీచర్‌ డేవిడ్‌ బాయ్స్‌ చిప్స్‌ ప్యాకెట్‌ కొనుక్కున్నాడు. అది తెరచి చూడగా అందులో బంగాళదుంప ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని డేవిడ్‌ బాయ్స్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసి ఆ సంస్థ దృష్టికి తీసుకువెళ్లారు. నాకు కెటిల్‌ చిప్స్‌ ప్యాకెట్‌లో.. క్రిప్స్‌ కనిపించలేదని, బంగాళదుంప ఉందని ట్వీటర్‌లో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన ఆ సంస్థ.. డేవిడ్‌కు క్షమాపణలు చెప్పింది. తమకు పొరపాటు ఎలా జరిగిందో తెలియదు, అయితే ఆ ప్యాకెట్‌ను తమకు అప్పగిస్తే వివరాలు సేకరిస్తామని సంస్థ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్ని కామెంట్లు చేస్తున్నారు. చిప్స్‌ ప్యాకెట్‌ కొన్న ఆ వ్యక్తి ఆలుగడ్డను గిఫ్ట్‌గా పొందాడంటూ నెటిజన్‌ ఫన్నీగా కామెంట్ చేశాడు. దీనిని జీవత కాల ట్రోఫీగా స్వీకరించాలనుకుంటున్నాను, నా జీవితంలో ఎప్పుడూ కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. ఈ బంగాళాదుంపలో ఎల్లప్పుడూ నా పేరు ఉంటుందని అనుకుంటున్నాను.. అంటూ డేవిడ్‌ చెప్పాడు.

Next Story