క‌న్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు.. ఓ తండ్రి, కూతురు.. పోరాటంలో సైనికుడు.. ఇలా ఇంకెన్నో..

Man breaks down as he bids adieu to daughter in Kyiv. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.

By Medi Samrat  Published on  25 Feb 2022 7:12 AM GMT
క‌న్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు.. ఓ తండ్రి, కూతురు.. పోరాటంలో సైనికుడు.. ఇలా ఇంకెన్నో..

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతున్నాయి. అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. దీంతో అక్క‌డి ప్రజలు దేశం నుండి హంగేరి వంటి పొరుగు దేశాలకు పారిపోతున్న విషాద చిత్రాలు వెలువడ్డాయి. అలాంటి ఓ వీడియోలో ఉక్రెయిన్‌లోని కైవ్‌లో ఒక వ్యక్తి తన కుమార్తెకు భావోద్వేగ వీడ్కోలు పలుక‌తున్న‌ట్లు చూడవచ్చు. కన్నీరు కారుస్తున్న ఓ వ్యక్తి తన కుమార్తెను ముద్దుపెట్టుకోవడం వీడియోలో చూడవచ్చు.. చిన్నారి కూడా ఏడుస్తోంది. కైవ్ నుండి పౌరుల కోసం ఏర్పాటుచేసిన‌ రెస్క్యూ బస్సులోకి వెళ్లడానికి ముందు ఆ వ్యక్తి తన కుమార్తెను కౌగిలించుకుని విలపించాడు. ఆ వ్యక్తి రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా పోరాటంలో సాయం చేయడానికి వారితో వెళ్ల‌డం లేద‌ని తెలుస్తోంది.

మరొక వీడియోలో ఒక ఉక్రేనియన్ సైనికుడు ఇలా అన్నాడు.. "మేము భారీ బాంబు దాడిలో ఉన్నాము.. అమ్మా.. నాన్న.. నేను నిన్ను ప్రేమిస్తున్నాను". అతను తన కుటుంబాన్ని మళ్లీ చూడగలనా లేదా అనే సందిగ్ధంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే.. పశ్చిమ దేశాలు, ఇతర దేశాలు అనేక ఆంక్షలు విధించినప్పటికీ రష్యా గురువారం ఉక్రెయిన్‌పై దాడి చేసింది. రష్యా దాడి నుంచి పారిపోతున్న శరణార్థులను అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నేఫ‌థ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. 27-బ్లాక్ నాటో.. తన దేశాన్ని గ్లోబల్ బాడీలోకి అనుమతించడానికి భయపడుతుందని అన్నారు.


Next Story