ఆల్బేనియా దేశంలో ఓ భర్త గోడు వింటే అందరికీ నవ్వు వస్తుంది. చీటికీ మాటికి గొడవలతో భార్యతో విసుగు చెందిన ఆ భర్త.. తనను జైల్లో పెట్టాలని పోలీసులను ప్రాధేయపడ్డాడు. చివరికి ఆ భర్త గోడు అర్థం చేసుకున్న పోలీసు అధికారులు అతడిని జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆల్బేనియాలో ఓ వ్యక్తి డ్రగ్స్ కేసులో నిందితుడిగా తేలాడు. దీంతో అతడిని గృహ నిర్బంధం చేయాలని అక్కడి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో అతడిని అధికారులు గృహనిర్బంధం చేశారు. అయితే అసలు సమస్య అప్పుడే మొదలైంది.
భార్యతో అతనికి ఎప్పుడూ ఏదో గొడవ జరుగుతూ ఉండేది. భార్యతో కలిస ఉండడంత అతనికి భరించలేనిదిగా మారింది. రోమ్ వెలుపల గైడోనియా మోంటెసిలియో అనే ప్రదేశంలో ఈ సంఘటన జరిగింది. భార్యతో ఏ మాత్రం అతనికి పడేది కాదు. ఇంటి నుంచి బయటకు వెళ్లిపోదామంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అతడు.. తనను జైలుకు తరలించాలని పోలీసులను వేడుకున్నాడు. అతని బాధను అర్థం చేసుకున్న పోలీసులు... నిబంధనలు ఉల్లంఘించాడన్న నెపంతో అతడిని జైలుకు తరలించారు.
కెప్టెన్ ఫ్రాన్సిస్కో గియాకోమో మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత అతడు చాలా నెలల గృహనిర్బంధంలో ఉన్నాడు. అతడికి ఇంకా కొన్ని సంవత్సరాల శిక్ష మిగిలి ఉంది.