కెన్యాకు చెందిన 25 ఏళ్ల చెస్ ఆటగాడు.. అమ్మాయి లాగా టోర్నమెంట్ లో పాల్గొన్నాడు. మహిళా ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొని పలు మ్యాచ్ లు గెలిచాడు. ఈ ప్లాన్ వేసిన వ్యక్తిని స్టాన్లీ ఒమొండి గా గుర్తించాడు. ఆర్థిక అవసరాల కోసం మోసం చేశానని అతడు చెప్పుకొచ్చాడు. బుర్కా ధరించి కళ్లద్దాలు పెట్టుకుని ఆ వ్యక్తి తన గుర్తింపును గోప్యంగా ఉంచాడు. స్టాన్లీ ఒమొండి తనను తాను మిల్లిసెంట్ అవుర్‌గా నమోదు చేసుకున్నాడు. టోర్నమెంట్ చివరిలో నిర్వాహకులకు అతడి విజయాలపై అనుమానం రావడంతో పెట్టేసుకున్నారు.
Chess.com ప్రకారం, నిర్వాహకులు మొదట్లో జోక్యం చేసుకోవడానికి సంకోచించారు. నాల్గవ రౌండ్ తర్వాత దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు. అతడిని ఓ ప్రైవేట్ గదిలోకి తీసుకెళ్లి అడగ్గా.. తాను అప్పుల్లో ఉన్నానని ప్రైజ్ మనీ గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో టోర్నమెంట్ లో పాల్గొన్నానని సదరు యూనివర్సిటీ విద్యార్థి అసలు విషయాన్ని బయటపెట్టాడు. నిజం బయటకు రావడంతో అతడిని టోర్నమెంట్ నుండి బహిష్కరించారు. అతను సాధించిన పాయింట్లు రివర్స్ చేసి.. అతడి ప్రత్యర్థులకు అందించారని Chess.com నివేదించింది.