పెళ్లి చేసుకున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాల..!

Malala yousafzai married home britain . బాలికల విద్య కోసం ఎంతగానో కృషి చేసిన ప్రచారకర్త, ప్రముఖ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ పెళ్లి

By అంజి  Published on  10 Nov 2021 4:14 AM GMT
పెళ్లి చేసుకున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాల..!

బాలికల విద్య కోసం ఎంతగానో కృషి చేసిన ప్రచారకర్త, ప్రముఖ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ పెళ్లి చేసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. తమ బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరంలో జరిగిందన్నారు. తన భర్త పేరు అస్సర్‌ అని మలాల చెప్పింది. ఇరు కుటుంబాల సమక్షంలో తమ వివాహం జరిగిందని వెల్లడించారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు మలాల. " ఈ రోజు నా జీవితంలో ఒక విలువైన రోజు.. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములం కావడానికి ముడివేశాం.. ఇంట్లో చిన్న నిక్కా వేడుకను జరుపుకున్నాము. మీ అశీస్సులు మాకు పంపండి" అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

అయితే మలాల వివాహం చేసుకున్న అస్సర్‌ అనే వ్యక్తిని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు చెందిన హైపెర్పార్మెన్స్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ అస్సర్‌ మాలిక్‌ అని అందరూ అంటున్నారు. కానీ దీనిపై ఎలాంటి ధృవీకరణ లేదు. ఇక గతంలో ఓ దినపత్రికకు మలాల ఇంచిన ఇంటర్య్వూలో.. ప్రజలు ఎందుకు పెళ్లి చేసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని.. మీరు మీ జీవితంలో ఒకరిని కలిగి ఉండాలంటే, మీరు పెళ్లి పత్రాలపై ఎందుకు సంతకం చేయాలి అంటూ మాట్లాడింది.


Next Story