ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత న‌మోదు

Magnitude 6 earthquake strikes Sulawesi in Indonesia.వ‌రుస భూకంపాల‌తో ఇండోనేషియా ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2023 9:41 AM IST
ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత న‌మోదు

వ‌రుస భూకంపాల‌తో ఇండోనేషియా ప్ర‌జ‌లు భ‌య‌బ్రాంతుల‌కు గురి అవుతున్నారు. సుల‌వేసిలో భారీ భూకంపం సంభ‌వించింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున సంభ‌వించిన ఈ భూ కంపం తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 6.1గా న‌మోదైంది. సముద్రంలో 147 కిలోమీటర్లు (91 మైళ్లు)లోతులో గోరంటాలోకు దక్షిణ ఆగ్నేయంగా 65 కిలోమీటర్లు (40 మైళ్లు) దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

గోరంటాలో ఉత్తర సులవేసి, ఉత్తర మలుకు,సెంట్రల్ సులవేసి ప్రావిన్సులలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపన‌లు చోటు చేసుకున్నాయి. ఇండోనేషియా వాతావరణ అధ్య‌య‌న విభాగం, జియోఫిజిక్స్ ఏజెన్సీలు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ భూకంపం కార‌ణంగా ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. రెండో రోజుల క్రితమే ఇండోనేషియాలో భారీ భూకంపం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. సోమవారం ఉద‌యం 6:30 గంట‌ల‌కు సుమ‌త్రా దీవుల్లో భూమి కంపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా న‌మోదైంది. అంతకుముందు వారం రోజుల క్రితం త‌నింబ‌ర్ ప్రాంతంలో 7.7 తీవ్రత‌తో భూమి కంపించింది.

ఇండోనేషియా విస్తారమైన ద్వీపసమూహం. 270 మిలియన్ల మందికి పైగా ప్ర‌జ‌లు ఇక్క‌డ నివాసం ఉంటున్నారు. పశ్చిమ జావాలో నవంబర్ 21న 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 331 మంది మరణించారు. సులవేసిలో 2018 భూకంపం, సునామీ వ‌ల్ల‌ 4,340 మంది మ‌ర‌ణించారు.

Next Story