ఈజిప్టు దేశంలోని పలు నగరాల్లో భూకంపం.. 5.7గా తీవ్రత

Magnitude 5.7 earthquake strikes Crete, felt in Egyptian cities. గ్రీస్‌లోని క్రీట్‌లో బుధవారం 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ జియోడైనమిక్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

By అంజి
Published on : 29 Dec 2021 1:49 PM IST

ఈజిప్టు దేశంలోని పలు నగరాల్లో భూకంపం.. 5.7గా తీవ్రత

గ్రీస్‌లోని క్రీట్‌లో బుధవారం 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ జియోడైనమిక్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. గాయాలు లేదా నష్టం గురించి ఎలాంటి తక్షణ నివేదికలు లేవని అధికారులు తెలిపారు. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ఇంతకుముందు 6.1 వద్ద ప్రకంపనలను నమోదు చేసింది. దేశంలోని కొన్ని నగరాల్లో భూకంపం సంభవించినట్లు ఈజిప్టు అధికారులు తెలిపారు. క్రీట్‌లో ఉన్న జియోడైనమిక్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అకిస్ ట్సెలెంటిస్ మాట్లాడుతూ.. అధికారులు మునుపటి 5.6 నుండి 5.7 రీడింగును సవరించారు.

అయితే భూకంపం సముద్రంలో రావడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. లేదంటే భారీ నష్టం జరిగేదని అధికారులు చెప్పారు. భూకంపం 80 కిమీ (49.7 మైళ్లు) లోతులో ఉందని ఈఎమ్‌ఎస్‌సీ తెలిపింది. 42.7 కి.మీ లోతు ఉన్నట్లు గ్రీక్ జియోడైనమిక్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఇదిలా ఉంటే భారత్‌లోని ఇవాళ అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం వచ్చింది. బుధవారం ఉదయం 5:31 గంటలకు పోర్ట్‌బ్లేర్, అండమాన్, నికోబార్ దీవుల్లో రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం 100 కిలోమీటర్ల లోతులో ఉందని ఎన్‌సిఎస్ తెలిపింది.

Next Story