ఇరాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని నటాంజ్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప ప్రాంతంలో ఒక ప్రధాన అణు కేంద్రం ఉంది. అయితే, ఈ ప్రకంపనల వల్ల కీలకమైన నటాంజ్ అణు కర్మాగారానికి ఏమైనా నష్టం వాటిల్లిందా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు.
స్థానిక మీడియా ప్రకారం.. శుక్రవారం ఇరాన్‌లో రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.. అయితే భూకంపం ధాటికి పలు గ్రామాల్లో అనేక ఇళ్ల కిటికీలు మాత్రమే విరిగిపోయాయి. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.