యూకే ప్రధానిగా లిజ్ ట్రస్
Liz Truss Is The New UK PM. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ ఎన్నికవ్వడంతో.. ఆమె ఆ దేశ కొత్త ప్రధానిగా
By Medi Samrat Published on 5 Sept 2022 6:43 PM ISTబ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ ఎన్నికవ్వడంతో.. ఆమె ఆ దేశ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వెస్ట్‌మినిస్టర్‌లోని కాన్ఫరెన్స్ సెంటర్‌లో సర్ గ్రహం బ్రాడీ ఈ ప్రకటన చేశారు. కన్జర్వేటివ్ రేసులో లిజ్ ట్రస్‌కు 81,326 ఓట్లు పోలయ్యాయి. రిషి సునాక్‌కు 60,399 ఓట్లు పడ్డాయి. మొత్తం ఎలక్టరేట్ సంఖ్య 1,72,437. దీంట్లో 82.6 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 654 బ్యాలెట్ పేపర్లను తిరస్కరించారు.
లిజ్ ట్రస్ తన ప్రత్యర్థి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను ఓడించారు. లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్ కు 60,399 ఓట్లు లభించాయి. ప్రధాని పీఠం కోసం చివరి వరకు బరిలో నిలిచిన భారత సంతతి రాజకీయవేత్త రిషి సునాక్ కు నిరాశ తప్పలేదు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచిపోనున్నారు. బోరిస్ జాన్సన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. కన్జర్వేటివ్ పార్టీలో పోటీ జరిగింది. రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య చివరి వరకు ఉత్కంఠ పోరు సాగింది. గెలుపు తర్వాత క్వీన్ ఎలిజబెత్ సెంటర్ 2 ఆడిటోరియం నుంచి లిజ్ ట్రస్ ప్రసంగించారు. నాయకత్వ రేసులో పాల్గొన్న నేతలందరికీ ఆమె థ్యాంక్స్ తెలిపారు. రిషి సునాక్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.