చైనాకు చెమటలు పట్టిస్తున్న వుహాన్ ఫైల్స్

Leaked Documents Show China Lied About Covid-19. కరోనా వైరస్‌.. చైనాలోనే ఈ వైరస్‌ జన్మించిందని ఎంతో మంది చెబుతూ వచ్చారు.

By Medi Samrat  Published on  2 Dec 2020 10:30 AM GMT
చైనాకు చెమటలు పట్టిస్తున్న వుహాన్ ఫైల్స్

కరోనా వైరస్‌.. చైనాలోనే ఈ వైరస్‌ జన్మించిందని ఎంతో మంది చెబుతూ వచ్చారు. కానీ చైనా మాత్రం భిన్నంగా చెబుతోంది. నాలుగు రోజుల క్రితం ఏకంగా భారత్ మీదనే సంచలన ఆరోపణలు చేసింది. భారత్ ‌లో కరోనా వైరస్‌ జన్మించిందని అక్కడ నుంచి వచ్చిన వస్తువుల మీద వైరస్‌ని గుర్తించామని చెప్పినా ఎవరూ నమ్మలేదు. తాజాగా చైనాకు చెమటలు పట్టించేలా.. 'వుహాన్‌ ఫైల్స్'‌ పత్రాలు బయటకు వచ్చాయి.

చైనా ఆరోపణలు అవాస్తవాలు అని తెలిపే ఆధారాలు ఉన్న 'వుహాన్‌ ఫైల్స్'‌ పత్రాలు సీఎన్‌సీఎన్‌ చేతికి చిక్కాయి. 177 పేజీల ఈ డాక్యుమెంట్‌ మీద 'అంతర్గత పత్రాలు.. రహస్యంగా ఉంచండి' అని ఉంది. ఈ పత్రాల్లో చైనా లోని స్థానిక హుబే ప్రాంతంలో తొలుత వైరస్‌ వెలుగు చూసిందని తెలిసింది. ఫిబ్రవరి 10 నాటికి ఇక్కడ 5,918 కేసులు నమోదయ్యాయి. అదే రోజున చైనా అధ్యక్షుడు తమ దేశంలో నమోదైన కేసుల సంఖ్యను ఇందులో సగానికి సగం తగ్గించి చెప్పడంతోనే చైనా అబద్ధాలు ఆడుతోందని స్పష్టం అవుతోంది.

డిసెంబర్‌ 2019, ప్రారంభంలోనే గుర్తు తెలయని ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి మొదలైనట్లు, దీని గురించి ఎక్కడ ఎలాంటి సమాచారం బయటకు వెల్లడించలేదని ఈ వుహాన్‌ ఫైల్స్‌లో ఉంది. 2019 అక్టోబర్‌ నుంచి 2020 ఏప్రిల్‌ వరకు హుబేలో వైరస్‌ని కట్టడి చేయడానికి సంబంధించిన సమాచారం ఉంది. హుబే ప్రావిన్షియల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నుంచి వచ్చిన అంతర్గత పత్రాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదికను ఆరుగురు నిపుణులు ధ్రువీకరించారు. మరెన్నో సంచలన విషయాలు ఈ ఫైల్స్ లో ఉన్నాయి.


Next Story