చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ మృతి చెందారు. ఆయన వయసు 96 ఏళ్లు. లుకేమియా, బహుళ అవయవ వైఫల్యం కారణంగా ఆయన ప్రాణాలను కోల్పోయారు. సొంత నగరమైన షాంఘైలో బుధవారం మధ్యాహ్నం 12.13 గంటలకు జియాంగ్ తుదిశ్వాస విడిచినట్లు చైనా అధికార మీడియా తెలిపింది. చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీ, పార్లమెంట్, కేబినెట్‌తోపాటు ఆ దేశ ఆర్మీ కూడా జియాంగ్ జెమిన్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.1993 మార్చి 27 నుంచి 2003 మార్చి 15 వరకు చైనా అధ్యక్షుడిగా ఉన్నారు. చైనాకు అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించి.. చైనా దౌత్య సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టాడు.
1926లో జన్మించిన జియాంగ్ జెమిన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. పలు ఆటోమొబైల్ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు. తన కాలేజీ రోజుల్లోనే CCPలో చేరిన అతను తన చరిష్మా కారణంగా పార్టీలో ఎదిగాడు. అతను 1985లో షాంఘై మేయర్ అయ్యాడు. ఆ తర్వాత నగరానికి CCP కార్యదర్శి అయ్యాడు. ఆ సమయంలో, షాంఘై చైనా కొత్త ఆర్థిక కేంద్రంగా మారింది. ఆ తర్వాత షాంఘైలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుని.. అంచెలంచెలుగా ఎదిగాడు. చైనా ఆర్థికంగా కుదేలవ్వకుండా ఉండడానికి జెమిన్ కూడా చాలా కష్టపడ్డారని చెబుతూ ఉంటారు.