ఆసుపత్రి పాలైన కింగ్ ఛార్లెస్ III
బ్రిటన్ రాజు ఛార్లెస్ III శుక్రవారం నాడు లండన్ లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.
By Medi Samrat Published on 26 Jan 2024 9:01 PM ISTబ్రిటన్ రాజు ఛార్లెస్ III శుక్రవారం నాడు లండన్ లోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎన్ లార్జ్డ్ ప్రోస్టేట్ చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. లండన్ క్లినిక్ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స చేయనున్నారు. వేల్స్ యువరాణి కేథరీన్ కి గత వారం ఇక్కడే శస్త్రచికిత్స జరిగింది. 75 ఏళ్ల కింగ్ ఛార్లెస్ III ఈ ఉదయం తన చికిత్సకు ముందు, వేల్స్ యువరాణిని ఆసుపత్రిలో పరామర్శించారు.
కింగ్ ఛార్లెస్ ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటారనేది ఇంకా తెలియరాలేదు. బకింగ్‌హామ్ ప్యాలెస్ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, ఛార్లెస్ ఆరోగ్యం బాగానే ఉందని తెలుస్తోంది. UK యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, ప్రోస్టేట్ సమస్య, 50 ఏళ్లు పైబడిన పురుషులలో సాధారణం. ఇది తీవ్రమైన అనారోగ్యం కాదు. 50 ఏళ్లు పైబడిన పురుషులలో ముగ్గురిలో ఒకరికి ఎన్ లార్జ్డ్ ప్రోస్టేట్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రోస్టేట్ అన్నది మూత్రాశయం దిగువన ఉన్న గ్రంథి. సెప్టెంబర్ 8, 2022న అతని తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత చార్లెస్ రాజు అయ్యాడు. అతని పట్టాభిషేకం మే 6, 2023న జరిగింది.