ఆ వీడియోలు చూశారని.. ఏడుగురికి ఉరిశిక్ష విధించిన కిమ్ జోంగ్ ఉన్

Kim Jong Un has sentenced seven people to death for watching South Korean videos. వీడియోలను చూసినందుకు ఉత్తర కొరియాలో.. ఏడుగురికి ఉరి శిక్ష విధించారని మానవ హక్కుల సంస్థ తెలిపింది.

By అంజి  Published on  21 Dec 2021 12:34 PM IST
ఆ వీడియోలు చూశారని.. ఏడుగురికి ఉరిశిక్ష విధించిన కిమ్ జోంగ్ ఉన్

దక్షిణ కొరియా వీడియోలను చూసినందుకు ఉత్తర కొరియాలో.. గడిచిన మూడేళ్లలో ఏడుగురికి ఉరి శిక్ష విధించారని మానవ హక్కుల సంస్థ తెలిపింది. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ బహిరంగ మరణశిక్షకు అధ్యక్షత వహించారని ఆరోపించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్న ఒక నియంతలా వ్యవహరిస్తాడన్న విషయం మనకు తెలిసిందే. దక్షిణ కొరియా సినిమాలు, సంగీతానికి సంబంధించిన వీడియోలను చూసి.. ఆ తర్వాత వాటిని సీడీలు, యుఎస్‌బీలలో కాపీ చేసి అక్రమంగా విక్రయించాడు. దీంతో వారిని ఉరి తీసి చంపారు. శుత్రదేశం దక్షిణ కొరియా పట్ల సానుభూతి చూపించడం ఉత్తర కొరియా అధ్యక్షుడికి నచ్చదు. ఈ విషయంలో తమ దేశ ప్రజలు దక్షిణ కొరియాపై సానుభూతి ఉండకూడదంటూ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పలు సందర్భాల్లో చెప్పారు. ఇదిలా ఉంటే ద‌క్షిణ కొరియా నుంచి వ‌ల‌స వ‌చ్చి ఉత్త‌ర కొరియాలో నివాస‌ముంటున్న వారిని కిమ్ జోంగ్‌ అన్యాయంగా హింసిస్తున్నాడ‌ని ఆ మాన‌వ హ‌క్కుల సంస్థ చెప్పింది.

సియోల్ ఆధారిత హక్కుల సంస్థ, ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్.. ఆరు సంవత్సరాల్లో 683 మంది ఉత్తర కొరియా ఫిరాయింపుదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం 27 మరణశిక్షలను నమోదు అయినట్లుగా తెలిపింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది డ్రగ్స్, వ్యభిచారం, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన నేరాలకు పాల్పడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన అసమ్మతివాదుల ఆధ్వర్యంలో నడిచే ఆన్‌లైన్ వార్తాపత్రిక డైలీ ఎన్‌కే.. మే 2021లో దక్షిణ కొరియా సినిమాలు, మ్యూజిక్ వీడియోలను కలిగి ఉన్న సీడీలు, యుఎస్‌బీలను"చట్టవిరుద్ధంగా" విక్రయించినందుకు ఉత్తర కొరియా అధికారులు ఒక వ్యక్తిని బహిరంగంగా ఉరితీశారని తెలిసింది.

Next Story