ఆ జీన్స్, హెయిర్ స్టైల్స్‌పై నిషేధం విధించిన ఉత్తర కొరియా

Kim Jong-un bans mullets, skinny jeans in North Korea. కిమ్ జంగ్ ఉన్.. ఇతడి పేరు వింటే భయం తో వణకడంమే కాదు, చిరాకు పడిపోతాం

By Medi Samrat  Published on  22 May 2021 1:20 PM GMT
ఆ జీన్స్, హెయిర్ స్టైల్స్‌పై నిషేధం విధించిన ఉత్తర కొరియా

కిమ్ జంగ్ ఉన్.. ఇతడి పేరు వింటే భయం తో వణకడంమే కాదు, చిరాకు పడిపోతాం కూడా. ఉత్తర కొరియాను ప్రపంచం నుంచి వేరు చేసిన అధినేత. ఇతను తన ప్రజలను పాలించే పద్ధతి గురించి తెలిస్తే.. మనం ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నామో అర్థమవుతుంది. ఈ దేశం ఇప్పటికీ సుమారు 100 ఏళ్లు వెనకబడే ఉందంటే మీరు నమ్ముతారా.. ఇక్కడ నో ఇంటర్నెట్, కేవలం మూడే మూడు టీవీ చానెళ్లు. నో ఫోన్స్, పేదరికాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వ కూడదు అందుకే వారి ఫొటోలు తీయకూడదు. ఇలా ఒకటేమిటీ ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లో మరికొన్ని చేరాయి.

ఇకపై ఉత్తర కోరియాలో ముల్లెట్స్ అంటే ముందుకంటే వెనుకకు జుట్టు ఎక్కువగా ఉండే ఒక స్టైల్, స్పైక్డ్ హెయిర్ వంటి రెట్రో హెయిర్‌స్టైల్‌తో పాటూ రకరకాల హెయిర్ కలర్ ల మీద నిషేధం విధించారు. దేశంలో యువతపై పాశ్చాత్య తరహా ఫ్యాషన్ పోకడలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటూ చిరిగిపోయినట్లుగా ఉండే జీన్స్, నినాదాలతో ఉండే టీ షర్ట్స్, ముక్కు, పెదాలపై పియర్సింగ్ లు ఉండడాన్ని కూడా నిషేధించారు. యుఎస్ తరహా పోకడలు యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని, చివరకు తమ దేశం ప్రాభవం కోల్పోయే అవకాశం ఉందని కిమ్ భావిస్తున్నారట. ప్రజలకి 15 హెయిర్ కట్స్ ను మాత్రమే అనుమతించారు. జీవనశైలిలో యూఎస్ తరహా మార్పుల వస్తే ఆర్థికంగా బలహీనంగా అయిపోయే అవకాశం ఉందని కిమ్ భావిస్తున్నారట. పాశ్చాత్య పోకడలు, హెయిర్‌ స్టైల్‌ విషయంలో ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. వారిపై నిఘా పెడతామని ఉన్ ప్రభుత్వం హెచ్చరించింది.
Next Story