మార్క్‌ జుకర్‌బర్గ్‌ ను జైళ్లో పడేయాలి : హాలీవుడ్ దర్శకుడు

Ken Burns Calls Mark Zuckerberg ‘an Enemy of the State’. ఫేస్ బుక్ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్నారు.

By Medi Samrat  Published on  5 Aug 2021 11:06 AM GMT
మార్క్‌ జుకర్‌బర్గ్‌ ను జైళ్లో పడేయాలి : హాలీవుడ్ దర్శకుడు
ఫేస్ బుక్ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ సోషల్ మీడియా రంగంలో దూసుకుపోతున్నారు. అయితే.. మార్క్ జుకర్ బర్గ్ స‌క్సెస్‌పుల్ ప‌ర్స‌న్‌గా ఎంత పేరు తెచ్చుకున్నారో.. వివాదాలు, విమ‌ర్శ‌ల్లో నానుతూ అంతే పేరుతెచ్చుకున్నారు. ఇప్ప‌టికే ఎంతోమంది మార్క్‌ జుకర్‌బర్గ్ తీసుకుని వచ్చిన సోషల్ మీడియా యాప్స్ ద్వారా వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం పడుతోందని విమర్శిస్తూ ఉన్నారు. చాలామంది పలువురు ప్రముఖులు కూడా మార్క్ జుకర్‌బర్గ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా.. తాజాగా హాలీవుడ్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకర్‌ కెన్‌ బర్న్స్‌ కూడా ధ్వ‌జ‌మెత్తారు. న్యూయార్క్‌ టైమ్స్‌ టెక్‌ జర్నలిస్ట్‌ కారా స్విషర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బర్న్స్ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశాడు


ఫేస్‌బుక్‌ ద్వారా తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్నాడని, అమెరికాకు ప్రధాన శత్రువు జుకర్‌బర్గేనని కెన్‌ బర్న్స్ విమర్శించాడు. ఫేస్‌బుక్‌లో తప్పుడు సమాచారంతో ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నాడని, ఫేస్‌బుక్‌ పోస్టులతో మనుషుల మానసిక స్థితితో ఆడుకుంటున్నాడని.. జుకర్‌బర్గ్‌ ను జైళ్లో పడేయాలని ఫైర్ అయ్యారు. అతని సహోద్యోగిణి ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్‌ శాండ్‌బర్గ్‌ ను కూడా లాక్కెళ్లి జైళ్లో పడేయాలని అన్నారు. ఇద్ద‌రిని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాజీలను విచారించినట్లుగా విచారించాలని అన్నారు. ఒక డెమొక్రాట్‌గా తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని.. అమెరికా చరిత్రలో బహుశా జుకర్‌బర్గ్‌ అంతటి ద్రోహి మరొకరు ఉండరని విమర్శలు గుప్పించారు.


Next Story