Kazakhstan Bodybuilder Who Married Doll. ఇటీవల కాలంలో మనుషులు ఒంటరి జీవితాలకి బాగా అలవాటు పడిపోయారు.
By Medi Samrat Published on 29 Dec 2020 6:56 AM GMT
ఇటీవల కాలంలో మనుషులు ఒంటరి జీవితాలకి బాగా అలవాటు పడిపోయారు. పెంపుడు జంతువులు, వస్తువులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతున్నారు. ఇక కొందరు తమ పెంపుడు జంతువులనే వివాహాం చేసుకున్న ఘటనలు గతంలో విదేశాల్లో జరిగాయి. తాజాగా.. ఓ వ్యక్తి ఏకంగా బొమ్మనే పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి తన స్నేహితులతో పాటు బంధులను ఆహ్వానించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కజకిస్థాన్‌కు చెందిన బాడీబిల్డర్ యూరి తోలోచ్కో ఓ సెక్సు బొమ్మను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సి ఉండగా.. కొవిడ్-19 కారణంగా ఆలస్యంగా జరిగింది. కేవలం 12 మంది అతిథుల సమక్షంలో నైట్ క్లబ్ వేదికగా యూరి తోలోచ్కో-మార్గోల పెళ్లి నిరాడంబరంగా జరిగింది. వేదికపై మార్గో చేతికి ఉంగరం తొడిగిన తనదానిని చేసుకున్నాడు. వివాహం అనంతరం అతిథులతో కలిసి ఈ జంట ఆనందంగా డ్యాన్స్ చేశారు.
ఇక్కడ మరో ఘటన యూరీని బాధకు గురిచేసింది. తాను వివాహమాడిన బొమ్మ క్రిస్మస్ పండుగకు ముందు విరిగిపోయింది. దీంతో పెళ్లి జరిగినా తన భార్యతో సరదాగా గడపలేకపోయాడట. దీంతో ఆ బొమ్మను.. కాదు కాదు యూరీ తన భార్యను మరమ్మతులు చేయించేందుకు వేరే నగరానికి పంపించాడు. తన భార్య బొమ్మ కోలుకున్నాక అదేనండి.. మరమత్ములు పూర్తి అయిన తరువాత తనతో గడుపుతానని చెబుతూ.. బొమ్మతో తన పెళ్లి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. తన బొమ్మ భార్య లేని సెలవురోజుల్లో స్నేహితులతో గడుపుతానని చెప్పాడు.