అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మరో రికార్డు సృష్టించారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హ్యారిస్ నిలిచారు. నవంబర్ 19వ తేదీన ఒక గంటా 25 నిమిషాలు ఆమె అమెరికా అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు. వివరాల్లోకి వెళ్తే.. కొలనోస్కోపీ కోసం అధ్యక్షుడు జో బైడెన్ మత్తు ఇంజెక్షన్ తీసుకున్నారు. కొలనోస్కోపీ వైద్యానికి అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. పెద్ద పేగకు సంబంధించిన ఈ చికిత్సకు కాస్తా సమయం పడుతుందని వైద్యులు జో బైడెన్‌కు చెప్పారు. దీంతో జోబైడెన్ తన అధ్యక్ష బాధ్యతలను కమలా హ్యారిస్‌కు అప్పజెప్పారు. దీంతో కమలా హ్యారిస్ 85 నిమిషాల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా పని చేశారు.
అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న కమలా హ్యారిస్ వైట్ హౌస్‌లోని వెస్ట్ వింగ్‌లోన ఉన్న తన కార్యాలయం నుండి పని చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి జెన్ సాకీ ఒక ప్రకటనలో తెలిపారు. 250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దాఖలాలు లేవు. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలు నిర్వహింలేని పరిస్థితిలో ఉంటే అమెరికా రాజ్యాంగంలోని 25వ అధికరణ ప్రకారం.. తన అధికారాలను మరొకరికి బదిలే ఛాన్స్ ఉంది. కాబట్టి అమెరికా తాత్కాలిక అధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ రాజ్యంగబద్ధంగానే కొసాగారు. 2002, 2007లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ బుష్ సైతనం కొలనోస్కోపీ పరీక్షల కోసం తన అధికారాన్ని ఉపాధ్యక్షుడికి బదిలీ చేశారు.