జో బిడెన్‌కు గాయాలు.. కుక్క‌తో ఆడుకుంటుండ‌గా..

Joe Biden twists ankle while playing with dog, visits doctor. అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్ పై..

By Medi Samrat  Published on  30 Nov 2020 4:07 AM GMT
జో బిడెన్‌కు గాయాలు.. కుక్క‌తో ఆడుకుంటుండ‌గా..

అమెరికా అధ్య‌క్ష‌ ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్ పై.. జో బిడెన్‌ అద్భుత సాధించిన విషయం తెలిసిందే. ఎంతో రసవత్తరంగా జరిగిన ఈ పోరులో జో బిడెన్.. ట్రంప్‌పై భారీ ఆధిక్యంతో అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌ తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ జారి పడి గాయపడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

జో బిడెన్ పెంపుడు‌ జాగిలంతో ఆడుకుంటూ జారి పడటంతో చీలమండకు గాయమైంది. దీంతో బిడెన్‌ డెలావేర్‌ లోని ఆర్ధోపెడిక్‌ డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకున్నారని బిడెన్‌ కార్యాలయం పేర్కొంది. ఇదిలావుంటే జో బిడెన్‌ రెండు కుక్కలను పెంచుకుంటున్నారు‌. ఇందులో 2018 లో దత్తత తీసుకున్న మేజర్తో అనే కుక్కతో ఆడుకుంటుండగా ఆయ‌న‌ జారిపడి గాయపడ్డారు‌. బిడెన్‌ 2008లో ఒక కుక్కను దత్తత తీసుకున్నారు. దీంతో బిడెన్.. వైట్‌ హౌస్‌కు తన రెండు పెంపుడు కుక్కల‌ను కూడా తీసుకురానున్నారు.


Next Story