భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పిన జో బైడెన్

Joe Biden Revokes Trump Ban On Many Green Card Applicants. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత ఐటీ

By Medi Samrat  Published on  25 Feb 2021 10:03 AM GMT
భారత ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పిన జో బైడెన్

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత ఐటీ నిపుణులకు ఎన్నో కఠిన నిబంధనలు ఉంచిన సంగతి తెలిసిందే..! ఇక అమెరికాలో కాలు పెడతామో లేదో కూడా తెలియని అయోమయం చాలా మందిలో కనిపించింది. తాజాగా అలాంటి వారికి అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌ గుడ్ న్యూస్ చెప్పారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వివాదాస్పద ఆర్డర్లపై బైడెన్‌ తీసుకున్నంటున్న సంచలన నిర‍్ణయాల్లో భాగంగా తాజాగా మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ్రీన్ కార్డ్ దరఖాస్తు దారులను అడ్డుకున్న గత ప్రభుత్వం ఆర్డర్‌ను జో బైడెన్ బుధవారం ఉపసంహరించుకున్నారు.

దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునేవారికి భారీ ఉపశమనం కలిగించారు. గత ప్రభుత్వం విధించిన వీసా నిషేధం మార్చి 31తో ముగుస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సరళీకృతం చేస్తానంటూ డెమొక్రాటిక్ అధ్యక్షుడు బైడెన్ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లయింది.

అమెరికా వ‌ర్క‌ర్ల హ‌క్కుల‌ను కాపాడే చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం గ్రీన్‌ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధించడంతో చాలా మందిలో కలవరం మొదలైంది. ట్రంప్‌ అప్పటి ఆంక్షలు సరైనవి బైడెన్ స్ప‌ష్టం చేశారు. ఈ ఆంక్ష‌లు అమెరికాలోని కుటుంబాలను తిరిగి కలవకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాల‌ను తీవ్రంగా దెబ్బ‌తీశాయ‌ని బైడెన్ ఆరోపించారు. బైడెన్ తీసుకుని వచ్చిన తాజా నిబంధనల ద్వారా ఎంతో మంది భారత్ ఐటీ నిపుణులకు మంచి జరగనుంది.


Next Story