జాబ్ లేద‌ని రెచ్చిపోయిన ఉన్మాది.. క‌త్తితో 20మందిపై దాడి.. ఆరుగురు మృతి

Jobless man kills 6 In China. ఉద్యోగం లేద‌న్న మ‌నోవేద‌న‌తో ఉన్న ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు.

By Medi Samrat  Published on  8 Jun 2021 5:55 AM GMT
జాబ్ లేద‌ని రెచ్చిపోయిన ఉన్మాది.. క‌త్తితో 20మందిపై దాడి.. ఆరుగురు మృతి

ఉద్యోగం లేద‌న్న మ‌నోవేద‌న‌తో ఉన్న ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. క‌త్తి ప‌ట్టి రోడ్డెక్కిన ఆ ఉన్మాది.. కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచి పడేశాడు. దాదాపు 20 మందిపై దాడిచేయ‌గా.. ఆరుగురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనాలోని హావ్‌నింగ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచ‌ల‌నం రేపింది.

వివ‌రాళ్లోకెళితే.. చైనాలోని హావ్‌నింగ్ ప్రాంతం మెయిన్‌లాండ్‌కు చెందిన వూ(25) అనే యువకుడు ఉద్యోగ లేమితో ఖాళీగా ఉన్నాడు. దీంతో వూ మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. దీనికితోడు కుటుంబంలో గొడవలు కూడా వూ ని మరింత వేదనకు గురిచేశాయి. దీంతో కోపంతో రగిలిపోయిన అతడు.. కత్తితో రోడ్డుపైకి వ‌చ్చి కనిపించిన వారిపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు.

ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 14 మంది తీవ్ర గాయాలపాల‌య్యారు. క్ష‌త‌గాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయ‌ప‌డ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఘ‌ట‌న‌తో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై రక్తపు మరకలు, దాడిలో గాయపడిన బాధితులతో ఆ ప్రాంతం ర‌క్త‌సిక్తంగా మారింది.
Next Story