సిబ్బందిని ఫూల్స్ చేసిన అమెరికా ప్రథమ మహిళ
Jill Biden disguises as flight attendant to prank staff, reporters. ఏప్రిల్ ఫస్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్
By Medi Samrat Published on 3 April 2021 3:02 AM GMTఏప్రిల్ ఫస్ట్‌ని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఫూల్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న ప్రాంక్‌లు చేస్తూ స్నేహితులను, సన్నిహితులను సరదాగా ఆటపట్టిస్తారు. అయితే వయసు పెరిగేకొద్దీ ఆ సరదా తగ్గిపోతుంది. అలాగే ఉద్యోగాలు, బాధ్యతలు కూడా మనలో ఉన్న చిన్న చిన్న సరదాలను పక్కకు నెట్టేస్తాయి. కొందరు మాత్రమే వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. సరదాగా గడిపేస్తూ అందరిని ఆకట్టుకుంటూ వెళుపోతారు. అలాంటి వారిలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కూడా ఒకరు అనిపిస్తుంది మీకు ఈ సంఘటన గురించి తెలిస్తే..
ఏప్రిల్ ఫూల్స్ డేన అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ తన సిబ్బందిని సరదాగా ఆటపట్టించారు. విమానంలో కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్‌కు వచ్చిన గ్యాప్‌లో తన సిబ్బందిని మాయ చేసి, నవ్వించారు. జిల్ బైడెన్ ఎయిర్‌హోస్టెస్‌లాగా బ్లాక్ డ్రెస్సు, ధరించారు. విగ్ పెట్టుకొని తన రూపాన్ని మార్చుకుని, బ్లాక్ మాస్క్ పెట్టుకుని చేతిలో ఐస్‌క్రీమ్లు పట్టుకున్ని ఆ విమానంలో ఉన్న రిపోర్టర్లు, వైట్‌హౌజ్ సిబ్బంది, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు సర్వ్ చేశారు. జాస్మిన్ అని నేమ్‌ట్యాగ్ పెట్టుకున్న జిల్ బైడెన్..ఫ్లయిట్ అటెండెంట్ గా అందర్నీ బోల్తా కొట్టించారు. సిబ్బంది క్యాబిన్లకు వెళ్లి ఐస్‌క్రీమ్ ఇచ్చారు.
మారు వేషంలో క్యాబిన్లను దాటుకుంటూ వెళ్లిన ఆమెను తన స్టాఫ్, నిఘా, మీడియా సిబ్బంది ఎవరు కూడా గుర్తించలేదు. ఐదు నిమిషాల తరవాత తిరిగి, మీడియా సిబ్బంది దగ్గరకు వచ్చి విగ్ తీసేస్తూ.. 'ఏప్రిల్ ఫూల్స్' అంటూ ఆటపట్టించారు. అరే, గుర్తుపట్టలేకపోయామే అనుకుంటూ.. ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతైది. ఏప్రిల్ ఫూల్స్ డేన ఇలా ప్రాంక్స్ చేసి ఆటపట్టించడం జిల్‌కు కొత్తేంకాదు. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె తోటివారిని ఫూల్స్ చేసిన సందర్భాలున్నాయి. కాలిఫోర్నియాలో జిల్ బైడెన్ టీకా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు, రైతులను కలిసి మాట్లాడారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌కు తిరిగి వస్తూ.. ఆమె సిబ్బందితో సరదాగా గడిపారు.