జేడీ వాన్స్, ఉష మధ్య గొడవ..! వైరల్ ఫోటోపై అమెరికా ఉపాధ్యక్షుడు ఏం చెప్పారంటే.?

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వైరల్ ఫోటోపై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో వాన్స్ తెల్లటి టీ-షర్ట్ ధరించి కోపంగా కనిపిస్తుండగా.. ఉష ఆయ‌న‌ ముందు కూర్చుని ఉంది.

By -  Medi Samrat
Published on : 10 Dec 2025 5:26 PM IST

జేడీ వాన్స్, ఉష మధ్య గొడవ..! వైరల్ ఫోటోపై అమెరికా ఉపాధ్యక్షుడు ఏం చెప్పారంటే.?

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వైరల్ ఫోటోపై స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో వాన్స్ తెల్లటి టీ-షర్ట్ ధరించి కోపంగా కనిపిస్తుండగా.. ఉష ఆయ‌న‌ ముందు కూర్చుని ఉంది. ఈ ఫోటోలో ఉష తల వంచి ముఖంపై చేతులు వేసుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన వెంటనే.. కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. దీనితో నెటిజ‌న్లు వారి వివాహ బంధంలో చీలిక వ‌చ్చిందేమోన‌ని పుకార్లు వ్యాప్తి చేయడం ప్రారంభించారు.

ఈ ఫోటోను షేర్ చేస్తూ ఒక X వినియోగదారుడు.. రిపబ్లికనిస్థాన్‌లో పరిస్థితి అంత బాగా లేనట్లు కనిపిస్తోందని రాశాడు. మరొక వినియోగదారుడు ఆ ఫోటోను AI ద్వారా తయారు చేసివుండ‌వ‌చ్చ‌ని పేర్కొన్నాడు.

వాన్స్ కూడా ఈ ఇమేజ్‌పై స్పందించాడు. నేను నా భార్యతో బిగ్గరగా గొడ‌వ‌ప‌డ‌టానికి బహిరంగంగా వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడూ అండర్ షర్ట్ ధరిస్తాను అని పేర్కొన్నారు.

అక్టోబర్ నుంచి వాన్స్ కుటుంబంపై నిఘా ఉంచారు. వాన్స్ ఎరికా కిర్క్‌ను కౌగిలించుకుని ఫోటో దిగ‌డం.. ఆ తర్వాత, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో జరిగిన రెండు ఈవెంట్‌లలో ఉష తన వివాహ ఉంగరం లేకుండా కనిపించడంతో వివాదం తెరపైకి వచ్చింది. అయితే.. ఉష ప్రతినిధి ఈ పుకార్లను కొట్టిపారేశారు. ఉష ఉంగరపు వేలికి.. ఆమె వివాహానికి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. బిజీగా ఉన్న తల్లి కావడంతో కొన్నిసార్లు తన ఉంగరాన్ని మర్చిపోతార‌ని చెప్పింది.

వాన్స్, ఉషల వివాహం 2014లో జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు కుమారులు ఇవాన్, వివేక్.. ఒక కుమార్తె మిరాబెల్ ఉన్నారు.

వాన్స్‌కు వివాదాలతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇటీవల ఆయ‌న‌ తన భార్య మతం గురించి చేసిన వ్యాఖ్యలకు విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. మిస్సిస్సిప్పిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏదో ఒక రోజు ఉష క్రైస్తవ మతంలోకి మారుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. త‌ను నాతో తరచుగా చర్చికి వెస్తుంటుదని.. ఆమె చివరికి క్యాథలిక్ సంప్రదాయం ద్వారా ప్రభావితమవుతుంద‌ని తాను ఆశిస్తున్నానని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టించాయి.

Next Story