ట్విట్టర్ సీరియల్ 'కిల్లర్'కి మరణ శిక్ష.!
Japan 'Twitter killer' sentenced to death for serial murders. జీవితం మీద విరక్తితో చనిపోదాము అనుకునేవారి విషయాలను
By Medi Samrat
జీవితం మీద విరక్తితో చనిపోదాము అనుకునేవారి విషయాలను గురించి ముందుగానే తెలుసుకొని వారితో స్నేహం చేసి కలిసి చనిపోదామని చెప్పిన సంఘటనలు కొన్ని సినిమాలలో చూసే ఉంటాము. అచ్చం సినిమాలను తలపించేలా జపాన్ లో అలాంటి ఘటన చోటుచేసుకుంది. తకాహిరొ షిరాయిషి అనే వ్యక్తిచనిపోవాలి అనుకునే వారి విషయాలను గురించి ముందుగా తెలుసుకొని ఏకంగా తొమ్మిదిమందిని హత్య చేసిన ఘటన టోక్యో నగరంలో చోటు చేసుకుంది.
తకాహిరొ షిరాయిషి మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకునే 15-26 సంవత్సరాల మధ్య వయసున్న వారిని ట్విట్టర్ ద్వారా వారితో పరిచయం ఏర్పర్చుకొని తను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్ననాని, ఇద్దరం కలిసి పోదామని వారిని నమ్మించాడు. అలా ఏకంగా తొమ్మిదిమందిని నమ్మించి వారి ప్రాణాలను బలి తీసుకున్నాడు. మొదటిగా వారిని చంపి వారి శవాలను ముక్కలు ముక్కలుగా చేసి కూల్ బాక్స్ లో భద్రపరిచారు.
సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తన ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు ట్వీట్ చేసిన ఓ మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని భావించిన ఆమె సోదరుడు ఆమె ట్విట్టర్ తెరిచి చూడగా అసలు నిజం బయటపడింది. ఆమె తరుచూ ట్విటర్‌లో తకాహిరొతో సంప్రదించడం తో అసలు నిజం బయటపడింది. దీంతో నిందితుడికి టోక్యో కోర్టు ఉరి శిక్ష విధించింది.
చనిపోయిన వారంతా వారు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన తకాహిరొతో పంచుకోవడం వల్లే వారిని హత్య చేసినట్లు తకాహిరొ తరుపు న్యాయవాది వాదించడం గమనార్హం. ఇష్టంగా చనిపోయిన వారి తల వెనుక గాయాలు ఎందుకు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ విచారణలో భాగంగానే నిందితుడు ఇంటి కింది భాగంలో ఓ రహస్య గదిలో ఈ తొమ్మిది శవాలు బయటపడ్డాయి. ఈ విధంగా తొమ్మిదిమంది అమాయకులను హతమార్చిన 'ట్విటర్ కిల్లర్' తకాహిరొ షిరాయిషికి టోక్యో కోర్టు మంగళవారం అతనికి మరణశిక్ష విధించింది.