రాజకీయ సంక్షోభం.. పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రధాని ప్రకటన
Japan Prime Minister Suga to step down this month. జపాన్ ప్రైమ్ మినిస్టర్ హోషిహిడే సుగా అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రైమ్ మినిస్టర్
By అంజి
పదవికి రాజీనామా చేయాలని జపాన్ ప్రధాని నిర్ణయం
పదవి నుంచి తప్పుకోనున్న జపాన్ పీఎం హోషిహిడే సుగా
జపాన్ ప్రైమ్ మినిస్టర్ హోషిహిడే సుగా అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ప్రైమ్ మినిస్టర్ పదవి నుండి తప్పుకోనున్నట్లు సుగా ప్రకటించారు. పీఎం నిర్ణయం జపాన్ రాజకీయ నాయకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోసారి కూడా ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేనని, నూతన నాయకుడిని ఎన్నుకోవాలని హోషిహిడే సుగా తెలిపారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్ 17 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ మొదలకానుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన లిబరల్ డెమెక్రాటిక్ పార్టీ అధ్యక్షుడిని సెప్టెంబర్ 29 నాటికి ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్‌లో లిబరల్ డెమెక్రాటిక్ పార్టీకి మెజార్టీ ఉన్నందును ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తే ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి.
ఉన్న సమయంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై మరింత దృష్టి పెట్టాలని ప్రైమ్ మినిస్టర్ హోషిహిడే సుగా నిర్ణయించున్నారు. మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేకన్నా.. కోవిడ్ నియంత్రణపై దృష్టి పెట్టాలని భావిస్తున్నానని ప్రైమ్ మినిస్టర్ హోషిహిడే సుగా పేర్కొన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజాదరణ కోల్పోయిన నేతగా హోషిహిడే సుగా నిలిచారు. గతేడాది ఆగస్టులో ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కోవిడ్ సమయంలో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ ఇప్పటి వరకు 15 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. కోవిడ్ సమయంలో టోక్యోలో ఒలింపిక్స్ నిర్వహించడం పట్ల.. ప్రైమ్ మినిస్టర్ హోషిహిడే సుగాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.