నింగిలోకి దూసుకెళ్లిన.. అతిపెద్ద జెమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌.. త్వరలోనే విశ్వం గుట్టు

James Webb Space Telescope Launch. అతి పెద్ద జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఫ్రెంచ్‌ గయానాలోని స్పేస్‌ సెంటర్‌ నుండి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన

By అంజి  Published on  25 Dec 2021 2:00 PM GMT
నింగిలోకి దూసుకెళ్లిన.. అతిపెద్ద జెమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌.. త్వరలోనే విశ్వం గుట్టు

అతి పెద్ద జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఫ్రెంచ్‌ గయానాలోని స్పేస్‌ సెంటర్‌ నుండి ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఎరియాన్‌ -5 రాకెట్‌ ద్వారా భారీ టెలిస్కోప్‌ను నింగిలోకి పంపించారు. కాగా తొలినాళ్లలో గెలాక్సీల గుట్టును, విశ్వం పుట్టుక గురించి ఈ టెలిస్కోప్‌ చెప్పనుంది. ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించిని అతిపెద్ద టెలిస్కోప్‌ ఇదే కావడం విశేషం. ఇది హబుల్‌ టెలిస్కోప్‌ కంటే రెండున్న రెట్లు పెద్దది. కంటికి కనిపించే నక్షత్రాలను ఎంతో స్పష్టంగా (వెయ్యి కంటే కోట్ల రెట్ల)తో ఈ వెబ్‌ టెలిస్కోప్‌ చూపనుంది. హబుల్‌ టెలిస్కోప్‌ కంటే వంద రెట్ల స్పష్టతతో జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ఫొటోలు తీస్తుంది. ఈ టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, కెనడా స్పేస్‌ ఏజెన్సీ, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు కలిసి రూపొందించాయి. రూ.75 వేల కోట్లు ఖర్చు చేసి.. 21 అడుగులు పొడవుతో టెలిస్కోప్‌ను తయారు చేశారు. ఈ వెబ్‌ స్పేస్‌ సహాయంతో నక్షత్రాలు, గెలాక్సీల గుట్టు విప్పనున్నారు.

నక్షత్రాల పుట్టుకను అధ్యయనం చేయడమే కాకుండా, ప్రారంభ విశ్వం ఎలా ఉంది వంటి సంక్లిష్ట ప్రశ్నలలోకి ప్రవేశించడానికి కూడా ఈ టెలిస్కోప్ ప్రయత్నిస్తుంది. తొలి నక్షత్రాలు, గెలాక్సీలు ఏర్పడటాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు. వెబ్ యొక్క ఇన్‌ఫ్రారెడ్ విజన్ దీన్ని 13.5 బిలియన్ సంవత్సరాలకు పైగా వెనుకకు చూసే శక్తివంతమైన టైమ్ మెషీన్‌గా చేస్తుంది. భూమి ప్రత్యేకంగా ఉందా? మనలాంటి ఇతర గ్రహ వ్యవస్థలు ఉన్నాయా? విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా?.. ఈ టెలిస్కోపుతో సమాధానం దొరకనుంది. టెలిస్కోప్ విస్తృత వైవిధ్యమైన ఎక్సోప్లానెట్‌ల వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఇది భూమికి సమానమైన వాతావరణాల కోసం మరియు మీథేన్, నీరు, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, సంక్లిష్ట సేంద్రీయ అణువుల వంటి కీలక పదార్ధాల సంతకాల కోసం కూడా శోధిస్తుంది.


Next Story