'భారత్-పాక్ సమస్యలో మధ్యవర్తిత్వం అంగీకరించలేదు'.. ఈ కౌంట‌ర్ ఎవ‌రికో తెలుసా.?

భారత్-పాకిస్థాన్ మధ్య వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెద్ద ప్రకటన చేశారు.

By Medi Samrat
Published on : 23 Aug 2025 1:46 PM IST

భారత్-పాక్ సమస్యలో మధ్యవర్తిత్వం అంగీకరించలేదు.. ఈ కౌంట‌ర్ ఎవ‌రికో తెలుసా.?

భారత్-పాకిస్థాన్ మధ్య వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెద్ద ప్రకటన చేశారు. ఒక కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ.. "భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం సమస్యపై మేము ఎలాంటి మధ్యవర్తిత్వానికి అంగీకరించము, 1970 ల నుండి యాభై సంవత్సరాలు గడిచాయి. ఇది జాతీయ ఏకాభిప్రాయం" అని అన్నారు. వాణిజ్యం విషయంలో, రైతుల ప్రయోజనాల విషయంలో, మా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విషయంలో, మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించే విషయంలో మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని అన్నారు.

ఎవరైనా మాతో విభేదిస్తే.. రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మీరు సిద్ధంగా లేరని.. మీరు మా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి విలువ ఇవ్వరని భారతదేశ ప్రజలకు తెలియజేయండి. మేము వీటిని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామ‌ని అని జైశంకర్ అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణను తీసుకువచ్చారని చాలాసార్లు చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌ను భారత్‌ ఖండించింది. పాకిస్థాన్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వం వహించడం ఆమోదయోగ్యం కాదని భారత్ స్పష్టం చేసింది.

ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైన్యం పాకిస్తాన్ లోపల 100 కిలోమీటర్లు చొచ్చుకుపోయి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. భారత క్షిపణులు పాకిస్థాన్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ ప్రగల్భాలు పలకడం మానుకోవడం లేదు.

Next Story