జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక 'సెక్స్ రూమ్స్’.. రెండు గంటల పాటు..
ఇటలీలోని జైళ్లలో కొత్త ప్రయోగం జరిగింది. ఇక్కడ జైలులో శృంగారం కోసం గదిని ఏర్పాటు చేశారు.
By Medi Samrat
ఇటలీలోని జైళ్లలో కొత్త ప్రయోగం జరిగింది. ఇక్కడ జైలులో శృంగారం కోసం గదిని ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇక్కడ ఓ ఖైదీ తన ప్రియురాలిని తొలిసారిగా కలిశాడు. కోర్టు ఆదేశాల తర్వాత జైలులో సెక్స్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఖైదీలు జైలు వెలుపల ఉన్న తమ భాగస్వాములతో సన్నిహిత క్షణాలు గడపవచ్చని ఇటాలియన్ కోర్టులు నమ్ముతాయి. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో జైళ్లలో సెక్స్ రూమ్‌లు నిర్మిస్తున్నారు. మొదట సెక్స్ రూమ్ టెర్ని జైలులో ఏర్పాటు చేశారు.
జనవరి 2024లో ఇటాలియన్ కోర్టు ఖైదీలు.. తమ జీవిత భాగస్వాములు, వారి భాగస్వాములతో ఎటువంటి గార్డులు లేకుండా సన్నిహితంగా కలుసుకునే హక్కు కోసం డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక యూరోపియన్ దేశాల్లో ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ దేశాల జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్ ఉన్నాయి.
కాగా, గత వారం ఇటలీ న్యాయ మంత్రిత్వ శాఖ కూడా సెక్స్ రూమ్‌లకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఆంతరంగిక సమావేశాలకు అనుమతి పొందిన ఖైదీలను రెండు గంటల పాటు గదిలోనే ఉండేందుకు అనుమతిస్తామని చెప్పారు. గదిలో బెడ్, టాయిలెట్ కోసం సదుపాయం ఉంటుంది. మార్గదర్శకాల ప్రకారం.. గది తలుపు తెరిచి ఉంచడం అవసరం. ఎందుకంటే ఏదైనా అవసరం వస్తే జైలు గార్డులు వెంటనే జోక్యం చేసుకుంటారు.
ఇదిలావుంటే.. ఖైదీల రద్దీతో ఇటలీ జైళ్లు ఇబ్బంది పడుతున్నాయి. దేశంలోని జైళ్లలో మొత్తం 62 వేల మంది ఖైదీలు ఉన్నారు. జైళ్ల మొత్తం సామర్థ్యం కంటే ఇది 21 శాతం ఎక్కువ. ఇటాలియన్ జైళ్ల పరిస్థితి ఐరోపాలో అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ ఆత్మహత్యల రేటు కూడా పెరిగింది.