ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్..!
Israeli Health Ministry reports a new strain of coronavirus. ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కొత్త కోవిడ్ వేరియంట్ యొక్క రెండు కేసులను
By Medi Samrat Published on 17 March 2022 8:42 AM GMT
ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ షాకింగ్ వార్త చెప్పింది. బుధవారం కోవిడ్-19 నూతన వేరియంట్ యొక్క రెండు కేసులను నమోదు చేసినట్లు తెలిపింది. అయితే.. ఇందుకు సంబందించి అనవసరపు ఆందోళన అవసరం లేదని అధికారులు తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ రకం ఒమిక్రాన్ యొక్క రెండు ఉప-వేరియంట్‌లు BA.1, BA.2 కలయికగా నూతన స్ట్రెయిన్ రూపాంతరం చెందినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణీకులకు జరిపిన పరీక్షలలో ఈ స్ట్రెయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వేరియంట్ గురించి ప్రపంచానికి తెలియదని మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.
ఈ రెండు కేసులలో జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి తేలికపాటి లక్షణాలు బయటపడ్డాయి. ఇందుకు సంబందించి వైద్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదని తెలిపింది. ఇజ్రాయెల్ పాండమిక్ రెస్పాన్స్ చీఫ్ సల్మాన్ జర్కా మహమ్మారి మొక్క ప్రమాదతీవ్రతను తగ్గించడంలో ప్రముఖపాత్ర వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొవిడ్-19 పలు రకాల రూపాంతరాల గురించి అందరికి తెలిసిందే. ఈ దశ తీవ్రమైన కేసులకు దారితీస్తుందని మేము చింతించడం లేదని ఆర్మీ రేడియోతో అన్నారు. ఇదిలావుంటే.. ఇజ్రాయెల్ 9.2 మిలియన్ల దేశ జనాభాలో నాలుగు మిలియన్లకు పైగా ప్రజలు కరోనా వ్యాక్సిన్ పొందినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.