మమ్మల్ని మోసం చేశారు.. అమెరికన్లతో చర్చలకు ఇక ఏమాత్రం ఆస్కారం లేదు..!
అమెరికాతో చర్చలు శాశ్వతంగా ముగిసిపోయాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు.
By - Medi Samrat |
అమెరికాతో చర్చలు శాశ్వతంగా ముగిసిపోయాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. ఇరాన్‌పై ఎలాంటి సైనిక చర్య తీసుకోబోమని హామీలు ఇచ్చి.. అమెరికా తమకు ద్రోహం చేసిందని ఆయన అన్నారు. Xలో విడుదల చేసిన ఒక వీడియోలో అరాఘ్చి మాట్లాడుతూ.. "అమెరికన్లతో చర్చలు శాశ్వతంగా ముగిసిపోయాయి.. దాడి చేయబోమని వాగ్దానాలు చేసిన తర్వాత.. ఇది ఒక చేదు అనుభవం.. ద్రోహం!" అని అన్నారు. ఈ పరిణామాలు టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య మిగిలి ఉన్న దౌత్యపరమైన అవకాశాలను కూడా హరించివేశాయని ఆయన జోఅన్నారు.
"అమెరికన్లతో చర్చలకు ఇక ఏమాత్రం ఆస్కారం లేదు. దాడి చేయబోమని వాగ్దానం చేసి మమ్మల్ని మోసం చేశారు. చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, మాపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు," అని అరాఘ్చి అన్నారు. ఈ అనుభవం నమ్మకానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది.."ఈ అనుభవం అత్యంత చేదుగా ఉంది, నమ్మకం అనే జాడ కూడా మిగల్లేదు. ప్రాంతీయ యుద్ధం దౌత్య ద్వారాలను శాశ్వతంగా మూసివేసింది అని అన్నారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో అమెరికా, ఇరాన్‌లు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరిస్తున్నాయని, ఇది పౌర భద్రత, ఆర్థిక అంతరాయంపై ఆందోళనలను పెంచుతోందని ఏపీ వార్తా సంస్థ తెలిపింది.
ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామన్న తమ బెదిరింపులను అమెరికా అమలు చేస్తే, హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెహ్రాన్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే వినాశనం సృష్టిస్తానని చెబుతూ, ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని బెదిరించారు.