హెలికాఫ్టర్ ధ్వంసం.. ఆయన బతికే అవకాశాలు లేవు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ జరిగిన తర్వాత పూర్తిగా ధ్వంసమైందని తేలింది.

By Medi Samrat  Published on  20 May 2024 10:15 AM IST
హెలికాఫ్టర్ ధ్వంసం.. ఆయన బతికే అవకాశాలు లేవు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ జరిగిన తర్వాత పూర్తిగా ధ్వంసమైందని తేలింది. క్రాష్ జరిగిన ప్రదేశంలో ఎవరూ బతికినట్లు సంకేతాలు లేవని ఇరాన్ ప్రభుత్వ మీడియాను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP సోమవారం నివేదించింది. ప్రతికూల వాతావరణం మధ్య పర్వత ప్రాంతాలలో గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ తరువాత, రెస్క్యూ బృందాలు సోమవారం కూలిపోయిన హెలికాప్టర్ ను చేరుకున్నాయి.

ఆదివారం దేశంలోని పర్వత వాయువ్య ప్రాంతంలోని జోల్ఫాలో హెలికాప్టర్ కూలిపోయింది. రైసీ, ఇతరులు అజర్‌బైజాన్‌తో ఇరాన్ సరిహద్దుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. టర్కీ ఆదివారం అర్థరాత్రి ఇరాన్‌కు నైట్-విజన్ సెర్చ్, రెస్క్యూ హెలికాప్టర్లు, డ్రోన్‌లను పంపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోసీన్ అమీర్ అబ్దొల్లాహియాన్ కూడా అదే హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నారు. ఇరాన్-అజర్ బైజాన్ సరిహద్దుల్లో ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్ కుప్పకూలింది. 63 ఏళ్ల ఇబ్రహీం రైసీ 2021 ఎన్నికల్లో గెలిచి ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

Next Story