దారుణం.. పెళ్లేందుకు చేసుకోలేదని అడిగాడని వ్యక్తిని కొట్టి చంపాడు

ఇండోనేషియాలోని ఒక వ్యక్తి.. తన పొరుగింటి వ్యక్తి చంపాడు. ఎందుకు వివాహం చేసుకోలేదని నిరంతరం అడగడం వల్ల కలత చెంది, కోపించి చంపేశాడు.

By అంజి  Published on  6 Aug 2024 10:13 AM IST
Indonesia, married, Crime, International news

దారుణం.. పెళ్లేందుకు చేసుకోలేదని అడిగాడని వ్యక్తిని కొట్టి చంపాడు

ఇండోనేషియాలోని ఒక వ్యక్తి.. తన పొరుగింటి వ్యక్తి చంపాడు. ఎందుకు వివాహం చేసుకోలేదని నిరంతరం అడగడం వల్ల కలత చెంది, కోపించి చంపేశాడని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది. ఉత్తర సుమత్రాలోని సౌత్ తపనులీ రీజెన్సీలో జూలై 29న ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల పర్లిందుంగన్ సిరెగర్ రాత్రి 8 గంటల సమయంలో 60 ఏళ్ల రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అస్గిమ్ ఇరియాంటో ఇంటికి వెళ్లి ఎటువంటి హెచ్చరిక లేకుండా కర్రతో దాడి చేయడం ప్రారంభించాడు.

అస్గిమ్ ఇరియాంటో భార్య చేసిన వాంగ్మూలం ఆధారంగా దాడికి సంబంధించిన వివరాలను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మరియా మార్పాంగ్‌ వెల్లడించారు. ఆకస్మిక దాడి తర్వాత 60 ఏళ్ల వృద్ధుడు తన ఇంటి నుండి బయటకు వచ్చి వీధిలోకి వచ్చాడు. కాని అతన్ని పర్లిందుంగన్ సిరెగర్ వెంబడించాడు. అతను బాధితుడి తలపై భారీ దెబ్బ కొట్టాడు. అస్గిమ్ ఇరియాంటో నేలపై పడిపోయిన తర్వాత, 45 ఏళ్ల వ్యక్తి తన పొరుగింటి వ్యక్తిని కొట్టి చంపాడు.

అస్గిమ్ ఇరియాంటోను ఆసుపత్రికి తరలించే ముందు పొరుగున ఉన్న నివాసితులు దూకి చివరికి దాడిని ఆపారు. అయితే మార్గమధ్యంలోనే 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మరియా మార్పాంగ్ తెలిపారు. దాడి జరిగిన గంటలోపే పర్లిందుంగన్ సిరెగర్‌ను అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. విచారణ సమయంలో.. అతను 60 ఏళ్ల వృద్ధుడు తనకు ఎందుకు వివాహం చేసుకోలేదని ఎంత తరచుగా చమత్కరించి అడిగేవాడని బాధపడ్డందున అస్గిమ్ ఇరియాంటోను కొట్టి చంపాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులకు చెప్పాడు.

Next Story