రెండోసారి గ్రామీ అవార్డు గెలుచుకున్న భారత్ కు చెందిన రికీ కేజ్

India's Ricky, Winning Second Award, Greeted Audience With A Namaste. సంగీతకారుడు రికీ కేజ్ ఆదివారం తన రెండవ గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు.

By Medi Samrat  Published on  4 April 2022 9:43 AM GMT
రెండోసారి గ్రామీ అవార్డు గెలుచుకున్న భారత్ కు చెందిన రికీ కేజ్

సంగీతకారుడు రికీ కేజ్ ఆదివారం తన రెండవ గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. భారతీయులందరూ దర్వించదగ్గ పరిణామం అని.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 64వ వార్షిక గ్రామీ అవార్డ్స్‌లో బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో 'డెవైన్ టైడ్స్' కు సంబంధించి స్టీవర్ట్ కోప్‌ల్యాండ్‌తో కలిసి ట్రోఫీని అందుకున్నాడు. ట్విట్టర్‌లో రికీ "ఈ రోజు మా ఆల్బమ్ డివైన్ టైడ్స్ వలన గ్రామీ అవార్డును గెలుచుకున్నాను. నా 2వ గ్రామీ కాగా.. స్టీవర్ట్ కు 6వది. నా సంగీతానికి తోడ్పాటును అందించిన వారికీ, విన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నీ వల్లే నేను ఇలా ఉన్నాను." అని చెప్పుకొచ్చారు. బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ విభాగంలో బెంగుళూరుకు చెందిన రికీ 2015లో తన ఆల్బమ్ 'విండ్స్ ఆఫ్ సంసార' కు తన మొదటి గ్రామీని గెలుచుకున్నాడు. రాక్ లెజెండ్ స్టీవర్ట్ కోప్‌ల్యాండ్‌తో కలిసి అవార్డును అందుకున్నప్పుడు, రికీ కేజ్ ప్రేక్షకులను నమస్తేతో పలకరించారు. రికీ కేజ్ USAలో జన్మించాడు, కానీ ఇప్పుడు బెంగళూరులో నివసిస్తున్నారు.

10 రోజుల కిందట గ్రామీకి నామినేట్ అయినప్పుడు.. "With just over 10 days to go for the upcoming GRAMMY awards, a huge shout out to all my fellow artists and collaborators from around the world for being a part of this special journey with #DivineTides." ఇలా రాసుకుని వచ్చాడు రికీ. ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల్లో 100కి పైగా అవార్డులు పొందిన రికీ కేజ్, 2015లో విండ్స్ ఆఫ్ సంసార ఆల్బమ్‌కు తన మొదటి గ్రామీ అవార్డును అందుకున్నారు. అతను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ హ్యుమానిటేరియన్ ఆర్టిస్ట్‌గా అవార్డు పొందారు. క్రియాశీల పర్యావరణవేత్తగా కూడా ఉంటున్నారు.

Next Story