ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి
Indian student dies of stroke in Ukraine. ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. చనిపోయిన విద్యార్థి పంజాబ్‌కు చెందినవాడు.
By Medi Samrat Published on
2 March 2022 12:45 PM GMT

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. చనిపోయిన విద్యార్థి పంజాబ్‌కు చెందినవాడు. చాలా కాలంగా ఆసుపత్రిలో ఉన్న అతను స్ట్రోక్‌కు గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం పౌరులందరినీ తక్షణమే ఖార్కివ్ విడిచిపెట్టాలని కోరుతూ అత్యవసర సలహాను జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అందరిని పెసోచిన్, బాబాయే, బెజ్లియుడోవ్కా స్థావరాలకు చేరుకోవాలని రాయబార కార్యాలయం తెలిపింది. మంగళవారం ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో భారతీయ విద్యార్థి చందన్ జిందాల్ మరణించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. "ఈ ఉదయం ఖార్కివ్‌లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని మేము తీవ్ర విచారంతో ధృవీకరిస్తున్నాము. మంత్రివర్గం అతని కుటుంబంతో టచ్‌లో ఉంది. కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము" అని మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది.
Next Story