కెనడాలో గాల్లోనే ఢీకొన్న విమానాలు.. భారతీయ ట్రైనీ పైలట్ దుర్మ‌ర‌ణం

కెనడాలోని మానిటోబాలో విమానాలు గాల్లోనే ఢీకొన్న ప్రమాదంలో మరణించిన ఇద్దరు పైలట్లలో 23 ఏళ్ల భారతీయుడు కూడా ఉన్నాడని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు

By Medi Samrat
Published on : 10 July 2025 8:52 PM IST

కెనడాలో గాల్లోనే ఢీకొన్న విమానాలు.. భారతీయ ట్రైనీ పైలట్ దుర్మ‌ర‌ణం

కెనడాలోని మానిటోబాలో విమానాలు గాల్లోనే ఢీకొన్న ప్రమాదంలో మరణించిన ఇద్దరు పైలట్లలో 23 ఏళ్ల భారతీయుడు కూడా ఉన్నాడని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ తెలిపారు. రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు ఢీకొన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీహరి సుకేశ్ కేరళకు చెందినవాడు. సుకేశ్ కొచ్చిలోని త్రిప్పునితురలోని స్టాట్యూ న్యూ రోడ్ నివాసి.

కెనడాకు చెందిన సవన్నా మే రాయ్స్ (20) అనే మరో యువ పైలట్ కూడా ఈ ప్రమాదంలో మరణించాడు. శ్రీహరి, సవన్నా ఇద్దరూ మానిటోబాలోని హార్వ్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్నారు. స్టెయిన్‌బాచ్ పట్టణం వద్ద శిక్షణలో భాగంగా చిన్న విమానాల్లో టేకాఫ్, ల్యాండింగ్‌లను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే రన్‌వేపై ఒకేసారి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో సుమారు 400 మీటర్ల ఎత్తులో వారి విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Next Story