భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారంతెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయి.

By -  Medi Samrat
Published on : 28 Feb 2026 4:50 PM IST

భారతీయులకు అలర్ట్.. భారత ఎంబసీ కీలక సూచనలు.!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. శనివారంతెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది.

ఇరాన్‌పై దాడుల కారణంగా ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. ఇజ్రాయెల్‌లోని భారత పౌరులు ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ ఇచ్చే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎంబసీ కోరింది.

అత్యవసర సమయంలో తలదాచుకోవడానికి వీలుగా తమ ఇళ్లకు సమీపంలో ఉన్న బంకర్లు లేదా షెల్టర్లను ముందుగానే గుర్తించి ఉంచుకోవాలని స్పష్టం చేసింది. పరిస్థితులు చక్కబడే వరకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, వీలైనంత వరకు కదలికలను పరిమితం చేసుకోవాలని పౌరులకు సూచించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పిన భారత ఎంబసీ.. అత్యవసర సహాయం కోసం కాంటాక్ట్ నంబర్లను అందించింది.

Next Story