పాకిస్తాన్ సైన్యానికి వార్నింగ్ ఇచ్చిన భారత సైన్యం
Indian Army halts work by Pak guards across LoC. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద భారత సైన్యం పాకిస్తాన్ నిర్మాణాన్ని
By Medi Samrat Published on 22 Dec 2021 11:12 AM GMT
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద భారత సైన్యం పాకిస్తాన్ నిర్మాణాన్ని అడ్డుకుంది.కుప్వారా జిల్లాలోని టీత్వాల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ రేంజర్లు నిర్మాణాన్ని ప్రారంభించడాన్ని భారత సైన్యం చూసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవ సరిహద్దులో యథాతథ స్థితిని కొనసాగించడానికి పరస్పర ఒప్పందాలు, అవగాహనకు విరుద్ధంగా పాక్ పనులు చేపట్టింది. భారత సైనికులు ఆ నిర్మాణాన్ని ఆపాలంటూ పాకిస్తాన్ సైన్యాన్ని మైక్‌లో తీవ్రంగా హెచ్చరించారు. పాక్ సైనికులు తక్షణమే ఈ నిర్మాణాన్ని ఆపేశారు. నియంత్రణ రేఖకు సమీపంలో పాకిస్తాన్ రేంజర్లు మంగళవారం చేపట్టిన నిర్మాణ కార్యకలాపాలను గమనించిన భారత సైన్యం దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
భారత సైన్యం తన అసంతృప్తిని తెలియజేసింది, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించి అనవసరమైన నిర్మాణాన్ని ఆపమని పాకిస్తాన్ ను కోరింది. ఈ నిర్మాణాన్ని తక్షణమే నిలిపేయాలి. ప్రోటోకాల్ ప్రకారం ఆ స్థలంలో ఏ నిర్మాణమూ చేపట్టరాదు. 500 మీటర్ల లోపు నిర్మాణాన్ని చేపడుతున్నారు. నిర్మాణం వద్దని పదే పదే చెబుతూనే ఉన్నాం. మీరు మాత్రం నిర్మాణ పనులు ఆపడం లేదు. మరోసారి హెచ్చరిస్తున్నామని భారత సైన్యం పాక్ సైన్యాన్ని మైకులో తీవ్రంగా హెచ్చరించింది. భారత సైన్యం రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వడంతో పాక్ పనులను ఆపి వేసింది.