ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయులను అప్రమత్తం చేసిన‌ రాయబార కార్యాలయం

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 7న ఉదయం గాజా నుంచి

By Medi Samrat  Published on  7 Oct 2023 3:15 PM GMT
ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయులను అప్రమత్తం చేసిన‌ రాయబార కార్యాలయం

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 7న ఉదయం గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు ఒక్కసారిగా చొరబాటుకు దిగారు. ఇజ్రాయెల్ లో పరిస్థితిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇజ్రాయెల్ లో ఉగ్రదాడుల వార్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని తెలిపారు. ఉగ్రదాడుల్లో బలైన అమాయకుల కుటుంబాలకు, బాధితులకు సానుభూతి తెలుపుతున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు ప్రధాని. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటిస్తున్నామని మోదీ అన్నారు.india-issues-advisory-for-citizens-in-israel-amid-state-of-war

ఇక ఇజ్రాయిల్, గాజా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇజ్రాయిల్ లో నివసిస్తున్న భారతీయులను రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. యుద్ధం జరిగే వాతావరణం ఏర్పడటంతో భారతీయులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అధికారులు సూచించే భద్రతా ప్రొటోకాల్ ను తప్పనిసరిగా పాటించాలని.. అధికారులతో నిత్యం టచ్ లో ఉండాలని కోరింది. అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్ నంబర్ +97235226748 లేదా cons1.telaviv@mea.gov.in ఈమెయిల్‌ ను సంప్రదించాలని ఎంబసీ అధికారులు భారత పౌరులను కోరారు.

Next Story