వారిని అనుమ‌తించండి.. ఈయూ దేశాల‌కు భారత్‌ విజ్ఞప్తి

India Approaches EU States to Set Up Reciprocal Vaccine Certificate Recognition. ‘గ్రీన్‌పాస్‌’ పథకం కింద కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు

By Medi Samrat  Published on  1 July 2021 4:24 AM GMT
వారిని అనుమ‌తించండి.. ఈయూ దేశాల‌కు భారత్‌ విజ్ఞప్తి

'గ్రీన్‌పాస్‌' పథకం కింద కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు వేసుకున్న భారతీయులను ఐరోపా దేశాలు అనుమతించాలని యురోపియ‌న్ యూనియన్‌ (ఈయూ)కు భారత్‌ విజ్ఞప్తి చేసింది. గురువారం నుంచి 'గ్రీన్‌పాస్‌' పథకాన్ని యురోపియ‌న్‌ యూనియన్‌ అమల్లోకి తేనుంది. దీని ప్రకారం యురోపియ‌న్‌ మెడిసన్స్‌ ఏజెన్సీ (ఈఏంఏ) ధ్రువీకరించిన టీకాలు వేసుకుంటే.. ఈయూ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు ఉండవు.

దీంతో 'గ్రీన్‌పాస్‌'లోకి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ను చేర్చి, కొవిన్‌ పోర్టల్‌ ద్వారా ఇచ్చే వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలను అంగీకరించాలని యురోపియ‌న్‌ యూనియన్ ను భారత్‌ కోరింది. ఈ విజ్ఞప్తికి యురోపియ‌న్‌ యూనియన్ సానుకూలంగా స్పందిస్తే.. భార‌త్‌ కూడా ఈయూ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని పేర్కొంది. ఈ విష‌య‌మై యురోపియ‌న్‌ యూనియన్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి మ‌రి.


Next Story