న్యాయ‌వాదుల‌ను క‌లిసేందుకు నో ప‌ర్మిష‌న్‌.. జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు బి-క్లాస్ సౌకర్యాలు

Imran Khan's life under threat in Attock Jail, kept in 9X11 feet room, given B-class facilities. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో

By Medi Samrat  Published on  7 Aug 2023 9:35 AM GMT
న్యాయ‌వాదుల‌ను క‌లిసేందుకు నో ప‌ర్మిష‌న్‌.. జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు బి-క్లాస్ సౌకర్యాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ తోషాఖానా కేసులో దోషిగా తేలి జైలులో ఉన్నారు. జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు బి-క్లాస్ సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆయన పార్టీ పిటిఐ ఆరోపించింది.

పాక్ వార్తాపత్రిక డాన్ ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ న్యాయవాదులను కలవడానికి కూడా అనుమతించలేదని పీటీఐ శ్రేణులు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్‌ను అటాక్ జైలుకు తరలించే యోచనలో అధికారులు ఆయ‌న‌ను పూర్తిగా చీకటిలో ఉంచినట్లు డాన్ నివేదించింది. మాజీ ప్రధానిని అడియాలా జైలుకు తీసుకువెళతారని వారు ఆశించారు. అయితే ఇమ్రాన్‌ను అటాక్ జైలు నుండి బయటకు తీసుకురావడంతో వారు అస‌లు విష‌యం తెలుసుకున్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌ న్యాయవాది నయీమ్‌ హైదర్‌ పంజోథా మాట్లాడుతూ.. జైలు ఇమ్రాన్‌ న్యాయవాదులకు నో ఎంట్రీ జోన్‌గా మారిందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్‌కు బట్టలు, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను అందించడానికి సంప్రదించాలని.. ఆయ‌న‌ సంతకాన్ని కూడా తీసుకోవాలని న్యాయ బృందం తెలిపింది. ఆయ‌న‌తో సమావేశానికి అధికారులు అనుమతించలేదు. పవర్ ఆఫ్ అటార్నీని సేకరించడానికి సోమవారం తిరిగి రావాలని న్యాయవాదులను కోరినట్లు డాన్ నివేదించింది.

అనేక దరఖాస్తులను కొనసాగించేందుకు, వివిధ కోర్టు ఆదేశాలను సవాలు చేయడానికి ఇమ్రాన్ ఖాన్ సంతకం చేసిన పత్రాలతో పాటు పవర్ ఆఫ్ అటార్నీ మాకు అవసరమని మేము అధికారులకు చెప్పామని ఒక న్యాయవాది చెప్పారు.

జైలు అధికారి మాట్లాడుతూ.. “బి-క్లాస్ కింద ఇమ్రాన్ ఖాన్ కు బ్యారక్‌లో బాత్రూమ్ సౌకర్యాలతో పాటు పుస్తకాలు, వార్తాపత్రికలు, టేబుల్, కుర్చీ, 21-అంగుళాల టెలివిజన్, ఒక పరుపు, బట్టలు, జైలు ఆహారం కూడా ఉంటాయని తెలిపారు. అయితే బయటి నుంచి ఆహారం తీసుకురావడానికి వీల్లేదని వెల్ల‌డించారు. ఇవే కాకుండా.. పారిశుధ్యం, వాషింగ్ సౌకర్యాలతో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయబడినప్పుడు దీపం వాడేందుకు ఇమ్రాన్ ఖాన్‌కు అనుమతించిన‌ట్లు వెల్ల‌డించారు.

Next Story