'ఐబొమ్మ' ఇక కనిపించదు

iBOMMA Announce Their Services Shut Down Permanently. 'ఐ బొమ్మ' తన వెబ్ సైట్‌ను షట్ డౌన్ చేసింది. అన్ని ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న తెలుగు కంటెంట్‌ను

By Medi Samrat  Published on  10 Sep 2022 11:42 AM GMT
ఐబొమ్మ ఇక కనిపించదు

'ఐ బొమ్మ' తన వెబ్ సైట్‌ను షట్ డౌన్ చేసింది. అన్ని ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న తెలుగు కంటెంట్‌ను ఒకే చోట చేర్చి విత్ అవుట్ యాడ్స్ మనకు అందించింది. ఐబొమ్మలో ఓటీటీలో విడుదలయ్యే అన్ని సినిమాలను డబ్బులు వెచ్చించకుండానే హై క్వాలిటీలో ఫ్రీగా చూడొచ్చు. సినిమా మొత్తాన్ని డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. దీంతో ఐబొమ్మను ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. ఇది పైరసీ కిందకే వస్తుంది. ఓటీటీలకు డబ్బులు చెల్లించుకోలేని వారు.. ఇందులో చూస్తూ ఉంటారు.

సెప్టెంబర్ 9 నుంచి భారతదేశంలో పూర్తిగా షట్ డౌన్ చేయనున్నట్లు ప్రకటించింది. ఎప్పటికీ తిరిగి రాము మెయిల్స్ చేయకండి అంటూ చెప్పేసింది. ఈరోజు నుంచి ఐబొమ్మ సేవలు నిలిచిపోయాయి. మన దేశంలో గురువారం అర్ధరాత్రి నుంచి ఐబొమ్మ వెబ్ సైట్ పనిచేయడం లేదు. కొద్దిరోజుల కిందట డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ తీసేసిన ఐబొమ్మ తాజాగా శాశ్వతంగా తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి సినీ ప్రేమికులకు షాకిచ్చింది. సెప్టెంబర్‌ 9నుంచి తమ ఇండియాలో తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో తిరిగి వచ్చే ఆలోచన కూడా లేదని, తమకు ఎవరు మెయిల్స్‌ చేయొద్దని యూజర్స్‌ను కోరింది.


Next Story