వందలాది విమాన సర్వీసులు రద్దు..కారణం అదేనట.!

Hundreds of flights cancelled in China. చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశం ఆంక్షల కట్టడిలోకి వెళ్తోంది. కరోనా కేసులు బయటపడుతున్న

By అంజి  Published on  29 Oct 2021 6:19 PM IST
వందలాది విమాన సర్వీసులు రద్దు..కారణం అదేనట.!

చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆ దేశం ఆంక్షల కట్టడిలోకి వెళ్తోంది. కరోనా కేసులు బయటపడుతున్న చోటా లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణ నిబంధనలను అక్కడి ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. బీజింగ్‌లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. బీజింగ్‌లోని రెండు ఎయిర్‌పోర్టుల్లో వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది. నగరంలోని కార్మికులకు బూస్టర్‌ డోసులు తప్పనిసరి చేసినట్లు చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ తెలిపింది. ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించింది. ఫిబ్రవరిలో చైనాలో వింటర్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంక్షలు కఠినతరం చేసింది. వింటర్‌ ఒలింపిక్స్‌లో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడుతోంది చైనా. ప్రపంచ దేశాలతో పోలిస్తే.. చైనాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. కానీ ముందస్తు రక్షణ చర్యలో భాగంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తోంది. శుక్రవారం నాడు చైనాలో 48 కొత్త కేసు నమోదయ్యాయి. గురువారం నాడు బీజింగ్‌కు వెళ్లే రెండు హై స్పీడ్‌ రైళ్లను అధికారులు నిలిపివేశారు. రైళ్లో ఉన్న 450 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు జరిపారు. ప్రజలు ప్రయాణాలను మానుకోవాలని హిలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ అధికారులు తెలిపారు. ఇక హార్బిన్‌ ఎయిర్‌పోర్టులో మూడో వంతు విమానాలను సర్వీసులను రద్దు చేశారు.

Next Story