ఏడుగురిని చంపిన వ్యక్తిని.. తుదముట్టించిన మహిళా పోలీసు

సిడ్నీలోని బోండి జంక్షన్‌లోని ఒక షాపింగ్ సెంటర్‌లో ఓ వ్యక్తి కత్తితో చేసిన దాడిలో 5 మంది ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on  13 April 2024 3:32 PM IST
ఏడుగురిని చంపిన వ్యక్తిని.. తుదముట్టించిన మహిళా పోలీసు

సిడ్నీలోని బోండి జంక్షన్‌లోని ఒక షాపింగ్ సెంటర్‌లో ఓ వ్యక్తి కత్తితో చేసిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడిని ఓ మహిళా పోలీసు ఆఫీసర్ అడ్డుకుంది. వెస్ట్‌ఫీల్డ్‌లో జరిగిన కత్తిపోటు ఘటనలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తి మాల్ లోపల విధ్వంసానికి పాల్పడ్డాడు, తొమ్మిది నెలల పాపతో సహా దుకాణదారులను కత్తితో పొడిచాడు. మహిళా పోలీసు అతన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. భయాందోళనకు గురైన దుకాణదారులు బయటకు పారిపోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, మహిళా పోలీసు దాడి చేసిన వ్యక్తిని అనుసరించింది. అతని ఛాతీపై గురి పెట్టి కాల్చి చంపినట్లు news.au లో ఒక నివేదిక తెలిపింది. మహిళా పోలీసు అధికారి ఆ పరిస్థితిలో ప్రశాంతంగా వ్యవహరించారని.. దాడి చేసిన వ్యక్తిని తన కత్తిని కింద పడేయమని అడిగారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అయితే, దుండగుడు తన కత్తితో పోలీసుపైకి దూసుకెళ్లగా.. ఆమె అతడిని కాల్చి చంపింది.

ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితుడిని పోలీసులు మ‌ట్టుబెట్టిన‌ట్లు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' స్ప‌ష్టం చేసింది. ఈ ఘ‌ట‌న‌తో షాపింగ్ మాల్‌లో ఉన్న‌ వంద‌ల సంఖ్య‌లో జ‌నం ఒక్క‌సారిగా ప‌రుగులు తీసిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. గాయ‌ప‌డిన వారిని అంబులెన్సులలో స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు తీసుకెళ్లారు.

Next Story