దారుణం.. పాక్‌లో హిందూ మహిళను నరికి చంపి.. ఆపై చర్మం ఒలిచి..

Hindu woman beheaded, skin peeled off in Pakistan. పక్క దేశం పాకిస్తాన్‌లో మైనార్టీలైన అయిన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

By అంజి  Published on  30 Dec 2022 5:35 AM GMT
దారుణం.. పాక్‌లో హిందూ మహిళను నరికి చంపి.. ఆపై చర్మం ఒలిచి..

పక్క దేశం పాకిస్తాన్‌లో మైనార్టీలైన అయిన హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పాక్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో మరో దారుణం వెలుగు చూసింది. సింజోరో పట్టణంలో బుధవారం ఓ హిందు మహిళ హత్యకు గురైంది. 40 ఏళ్ల మహిళ దయా భీల్‌ను అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆమె తలను, రొమ్మును నరికి వేసినట్లు హిందూ సమాజానికి చెందిన పాకిస్తాన్‌ తొలి మహిళా సెనేటర్‌ కృష్ణ కుమారి తన ట్వీట్‌లో తెలిపారు. బాధితురాలి శరీరంపై ఉన్న చర్మాన్ని నిందితులు ఒలిచారని పాకిస్తాన్‌ పీపుల్స్ పార్టీ నాయకురాలు కృష్ణ కుమారి చెప్పారు. బాధిత మహిళకు నలుగురు పిల్లలు ఉన్నారు.

కృష్ణ కుమారి ఒక ట్వీట్‌లో.. ''దయా భీల్ అనే 40 ఏళ్ల వితంతువును దారుణంగా హత్య చేశారు. మృతదేహం చాలా దారుణంగా కనిపించింది. ఆమె తల శరీరం నుండి వేరు చేయబడింది. క్రూరులు తల మొత్తం మాంసాన్ని తొలగించారు. ఘటనా స్థలికి పోలీసు బృందాలు సింజోరో, షాపుర్చకర్ కూడా చేరుకున్నారు." అని చెప్పారు. పిపిపికి చెందిన జియాలా అమర్ లాల్ భీల్ బుధవారం వ్యవసాయ క్షేత్రంలో ఛిద్రమైన మృతదేహాన్ని గుర్తించామని, పోలీసులు మహిళ కుటుంబీకుల నుండి వివరాలు సేకరించారని పేర్కొన్నారు. మృతదేహానికి పోస్ట్ మార్టం జరిగింది. తదుపరి విచారణ జరుగుతోంది.

"కిరాతకంగా హత్య చేయబడిన దయా భీల్ ఘటనను మీడియాలో హైలైట్ చేయలేదు. ఇస్లామాబాద్‌లోని రాజకీయ నాయకులు లేదా సింధ్ ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకీ పోలీసులు నిందితులను పట్టుకుంటారా? హిందువులను వారి మాతృభూమిలో సమాన పౌరులుగా చూస్తారా? అని లాభాపేక్ష లేని ఓ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. మైనారిటీలను రక్షించాలని పాకిస్థాన్‌కు గురువారం కోరింది. వారికి భద్రత, తగిన రక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.


Next Story