పాక్‌లో హిందూ భక్తుడిని చంపిన దుండగులు
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో హిందూ భక్తుడిని కాల్చిచంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 15 Nov 2024 3:45 PM GMTపాకిస్థాన్‌లోని లాహోర్‌లో హిందూ భక్తుడిని కాల్చిచంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం ప్రకారం, హిందూ భక్తుడు శ్రీ గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాష్ పర్వ్‌కు హాజరయ్యేందుకు శ్రీ నంకనా సాహిబ్‌కు వెళ్తున్నాడు. దారిలో దుండగులు అతడిని కాల్చిచంపారు.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా నగరానికి చెందిన రాజేష్ కుమార్ తన స్నేహితుడు, బంధువుతో కలిసి కారులో లాహోర్ నుండి నంకనా సాహిబ్‌కు వెళ్తున్నాడు. దారిలో లాహోర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనన్‌వాలా-నంకానా సాహిబ్ రోడ్డులో ముగ్గురు దొంగలు వారిని అడ్డుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురి నుంచి దుండగులు నాలుగున్నర లక్షల పాకిస్థానీ రూపాయలను దోచుకెళ్లారు. కారు డ్రైవర్ నుంచి 10 వేల పాకిస్థానీ రూపాయలను కూడా లాక్కెళ్లారు. అయితే ఈ సమయంలో రాజేష్ కుమార్ దొంగలను ఎదిరించాడు. ప్రతిగా దుండగులు వారిపై కాల్పులు జరిపారు.
రాజేష్ కుమార్‌పై కాల్పులు జరపడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ గురువారం మృతి చెందాడు. బంధువు ఫిర్యాదు మేరకు పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
శ్రీ గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాష్ పర్వాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన జన్మస్థలం గురుద్వారా శ్రీ నంకనా సాహిబ్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ప్రకాష్ పర్వ్‌లో పాల్గొనడానికి భారతదేశం నుండి 2,500 మందికి పైగా సిక్కు భక్తులు పాకిస్తాన్ చేరుకున్నారు.