వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో 'మెడికల్ రెఫరల్' అంటే ఏమిటి?

Here’s what ‘Medical Referral’ means in your Qatar Visa Application Process. స్టేట్ ఆఫ్ ఖతార్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ తన ఖతార్ వీసా కేంద్రాల తరఫున

By Medi Samrat  Published on  26 Aug 2022 4:45 AM GMT
వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో మెడికల్ రెఫరల్ అంటే ఏమిటి?

స్టేట్ ఆఫ్ ఖతార్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ తన ఖతార్ వీసా కేంద్రాల తరఫున సెలెక్ట్ రెసిడెన్సీ ప్రొసీజర్స్ ను తప్పనిసరి చేసింది. ఖతార్ లో పని చేసేందుకు వెళ్లే వారంతా కూడా ఖతార్ కు బయలుదేరే ముందు తమ స్వదేశాల్లో బయోమెట్రిక్ నమోదును పూర్తి చేయాలి, వర్క్ కాంట్రాక్ట్ పై సంతకం చేయాలి, తమ వీసా మెడికల్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. ఖతార్ మెడికల్ సెంటర్ లో వీసా మెడికల్ ప్రాసెస్ సందర్భంగా పూర్తి చేయాల్సిన వాటిలో ఎసెన్షియల్ మెడికల్ చెకప్, వివిధ రకాల బ్లడ్ టెస్టులు, ఎక్స్ -రే, టీకాలు వేయించుకోవడం వంటి వాటితో సహా ఆవశ్యకతలకు అనుగుణంగా కొన్ని కీలక వైద్య సేవలను పూర్తి చేయాల్సి ఉంటుంది.

మెడికల్ రెఫరల్ రెఫరల్ ప్రాసెస్ అంటే ఏమిటి? మెడికల్ రెఫరల్స్ లో రకాలేంటి?

వీసా అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా,ఆరంభ మెడికల్ రిపోర్టులను సమీక్షించిన తరువాత, కొంతమంది దరఖాస్తుదారులకు (లాంజ్ / వీఐపీ చేర్చబడ్డారు) ఖతార్ అధికారులచే నిర్వచించబడిన విధంగా ప్రొటొకాల్స్ కు అనుగుణంగా అడ్వాన్స్­డ్ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాల్సిందిగా మెడికల్ రెఫరల్ జారీ కావచ్చు.

ఈ అడ్వాన్స్­డ్ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ ను మెడికల్ రెఫరల్స్ అని అంటారు. అవి:

· అదనపు ఎక్స్ – రే ఇమేజ్ లు – దరఖాస్తుదారులు ఎంఒహెచ్ సూచనలకు అనుగుణంగా అదనపు ఎక్స్ – రే ఇమేజ్ ల కోసం ఖతార్ మెడికల్ సెంటర్ ను సందర్శించాల్సి ఉంటుంది.

· అదనపు ల్యాబ్ టెస్టులు – అదనపు ల్యాబ్ టెస్టులు అవసరమైతే, తదుపరి పరీక్షల కోసం రక్త నమూనాలను ఎక్స్ టర్నల్ ల్యాబ్ లకు పంపిస్తారు.

· ఎక్స్ టర్నల్ స్పెషలిస్ట్ టెస్ట్స్ – దరఖాస్తుదారులు ఎంఒహెచ్ మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి పరీక్షల కోసం ఆమోదిత హాస్పిటల్స్ లో స్పెషలిస్టులకు రెఫర్ చేయబడుతారు. (రెఫరల్ లెటర్ కలెక్షన్/ డాక్యుమెంట్ సమర్పణలు అవసరం కావచ్చు)

ఎలాంటి పరిస్థితుల్లో దరఖాస్తుదారులకు మెడికల్ రెఫరల్స్ కు సలహా ఇస్తారు ? / ఎందుకోసం మెడికల్ రెఫరల్స్ జారీ చేయబడుతాయి?

ఆరంభ మెడికల్ రిపోర్ట్స్ ను సమీక్షించిన తరువాత ధ్రువీకరణ విశ్లేషణల కోసం లోతైన డయాగ్నసిస్ కోసం అదనపు ఎక్స్ రే ఇమేజెస్ / ల్యాబ్ టెస్టులు/ స్పెషలిస్టు టెస్టులకు ఎంఓహెచ్ సిఫారసు చేయవచ్చు.

మెడికల్ రెఫరల్ ప్రాసెస్ తప్పనిసరా?

మెడికల్ రెఫరల్స్ అందుకున్న దరఖాస్తుదారులు అలాంటి నిర్ధారణ పరీక్షలకు వెళ్లడం ఇష్టం లేకుంటే ఏ దశలోనైనా రిసెప్షన్ డెస్క్ వద్ద లభించే రెఫ్యూజల్ ఫామ్ నింపడం ద్వారా తమ వీసా దరఖాస్తును ప్రాసెస్ చేయవద్దని ఎంచుకోవచ్చు.

మెడికల్ రెఫరల్ అవసరమైతే, దరఖాస్తుదారుకు ఆ సమాచారం ఎలా తెలియజేయబడుతుంది?

ఎస్ఎంఎస్ లేదా కాల్ ద్వారా దరఖాస్తుదారులకు ఆ సమాచారం తెలియజేయబడుతుంది. అందుకు వీలుగా, సరైన, పని చేస్తున్న ఫోన్ నెంబర్ ను రిసెప్షన్ వద్ద ఇవ్వాల్సిందిగా సూచించడమైంది.

మెడికల్ రెఫరల్ అపాయింట్ మెంట్ ను బుక్ చేసుకోవడం ఎలా?

దరఖాస్తుదారులు రెఫరల్ ప్రాసెస్ ను ముందుకు తీసుకెళ్లేందుకు రెఫరల్ అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ లేదా కాల్ ద్వారా అది వివరించబడుతుంది. అంతేగాకుండా వారు మెడికల్ రెఫరల్స్ కోసం అపాయింట్ మెంట్ బుక్ చేసుకునేందుకు క్యూవీసీ ( QMC ) హెల్ప్ లైన్ కు ఫోన్ చేయవచ్చు.

మెడికల్ రెఫరల్ ప్రాసెస్ పూర్తి అయ్యేందుకు ఎంత సమయం పట్టవచ్చు?

అడ్వాన్స్డ్ టెస్టుల స్వభావాన్ని బట్టి ఈ టెస్టులు పూర్తి అయ్యేందుకు రోజులు మొదలుకొని వారాల సమయం పట్టవచ్చు. నిర్దిష్ట కేసుల్లో మెడికల్ రిపోర్టుల అదనపు తనిఖీలు/ వెరిఫికేషన్/ సమీక్షకు మరింత జాప్యం కావచ్చు.

ఎక్స్ టర్నల్ వైద్యకేంద్రాలు దరఖాస్తుదారులకు నేరుగా ఏవైనా టెస్టులను సూచిస్తాయా?

మెడికల్ రెఫరల్ దరఖాస్తుదారులు ఖతార్ ఎంఓహెచ్ సిఫారసు చేసిన టెస్టులను మాత్రమే పూర్తి చేసుకోవా ల్సిన అవసరం ఉంది. రెఫరల్ లెటర్ లో పేర్కొనబడని ఏ విధమైన అదనపు టెస్టు (లు) సమాచారాన్ని +91 44 6133 1333 కు ఫోన్ చేయడం ద్వారా లేదా info@qatarmedicalcenter.com/ info.ind@qatarvisacenter.com కు మెయిల్ చేయడం ద్వారా ఖతార్ మెడికల్ సెంటర్ కు తెలియజేయవచ్చు.

అడ్వాన్స్ డ్ మెడికల్ రెఫరల్ టెస్టులను ఎక్కడ నిర్వహిస్తారు?

వీటి కోసం దరఖాస్తుదారులు:

- సిటి స్కాన్స్, క్వాంటిఫెరాన్ టెస్టులు, ఇతర పరీక్షలతో సహా ఖతార్ ఎంఒహెచ్ చే జారీ చేయబడే అడ్వాన్స్ డ్ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కోసం ఎక్స్ టర్నల్ హెల్త్ కేర్ కేంద్రాలను సందర్శించాలి

- ఖతార్ ఎంఒహెచ్ సూచనల ప్రకారం అదనపు ఎక్స్ రే స్కాన్ ల కోసం ఖతార్ మెడికల్ సెంటర్ లను అదే రోజు లేదా వాటి లభ్యతను బట్టి తదుపరి రోజు సందర్శించవచ్చు

నిర్దిష్ట ప్రత్యేక కేసుల్లో దరఖాస్తుదారులు ఈ అడ్వాన్స్ డ్ మెడికల్ టెస్టులను దేశంలో మరేదైనా ఖతార్ మెడికల్ సెంటర్ లొకేషన్ లో చేయించుకునేందుకు అనుమతించబడుతారు.

దరఖాస్తుదారులు తాము ఎంచుకున్న ఏదైనా ఎక్స్ టర్నల్ హాస్పిటల్ / ల్యాబ్ కు వెళ్లవచ్చా?

మార్గదర్శకాలకు, ఆరోగ్య సంరక్షణ సంబంధిత నియంత్రణ నిబంధనలకు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ మెడికల్ టెస్టులు జరిగేందుకు వీలుగా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్), ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్) వంటి నియంత్రణ ప్రమాణాలను సాధించేందుకు ఖతార్ మెడికల్ సెంటర్ అక్రెడిటెడ్ ఆరోగ్యసంరక్షణ కేంద్రాలను గుర్తించి, ఎంప్యానెల్ చేస్తుంది. అందువల్ల దరఖాస్తుదారు లు తమ ప్రాసెస్ ను పూర్తి చేసుకునేందుకు గాను తప్పనిసరిగా తమ రెఫరల్ ప్రాసెస్ ను ఆమోదిత ఎక్స్ టర్నల్ ల్యాబ్స్ / హాస్పిటల్స్ లోనే చేయించుకోవలసి ఉంటుంది.

మెడికల్ రెఫరల్ ప్రాసెస్ లో మరేవైనా అదనపు చార్జీలు ఉంటాయా?

దరఖాస్తుదారులకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే ఖతార్ మెడికల్ సెంటర్ ఈ అదనపు ఎక్స్ – రే స్కాన్స్ ను నిర్వహిస్తుంది. ఆమోదిత ఎక్స్ టర్నల్ వైద్యకేంద్రాల్లో చేసే అడ్వాన్స్ డ్ మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కు మాత్రం దరఖాస్తుదారులు ఆయా రెఫర్డ్ వైద్య కేంద్రాల్లో టెస్ట్ చార్జీలను చెల్లించాల్సి ఉంటంది. దరఖాస్తుదారులకు సంబంధిత ఎక్స్ టర్నల్ వైద్యకేంద్రాలు అధికారిక బిల్లులను జారీ చేస్తాయి.

దరఖాస్తుదారులు వైద్యపరంగా అన్ ఫిట్ అని ప్రకటించేందుకు కారణం ఏమిటి?

మెడికల్ స్టేటస్ పై నిర్ణయం అనేది ప్రొటొకాల్స్, మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంఓహెచ్ చే ప్రకటించబడుతుంది. దరఖాస్తుదారులు ఈ స్టేటస్ గురించిన సమాచారాన్ని ఖతార్ మెడికల్ సెంటర్ సిస్టమ్ / ఖతార్ వీసా సెంటర్ వెబ్ సైట్ నుంచి నేరుగా అప్ డేట్ పొందగలుగుతారు. మెడికల్ – అన్ ఫిట్ స్టేటస్ కు సంబంధించిన కారణాన్ని ఎంఒహెచ్ వెల్లడించదు.


Next Story