నా పార్ట్‌న‌ర్‌వి భారతీయ మూలాలే.. కొడుకు పేరు శేఖర్ : మస్క్

ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఇటీవల తన భాగస్వామిని ప్రస్తావిస్తూ.. తన భాగస్వామికి భారతీయ మ‌లాలు ఉన్నాయ‌ని చెప్పాడు.

By -  Medi Samrat
Published on : 1 Dec 2025 3:53 PM IST

నా పార్ట్‌న‌ర్‌వి భారతీయ మూలాలే.. కొడుకు పేరు శేఖర్ : మస్క్

ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న ఎలోన్ మస్క్ ఇటీవల తన భాగస్వామిని ప్రస్తావిస్తూ.. తన భాగస్వామికి భారతీయ మ‌లాలు ఉన్నాయ‌ని చెప్పాడు. మస్క్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో అతని భాగస్వామి శివోన్ జిలీస్‌ వార్తల్లో నిలిచారు.

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్ కనిపించాడు. ఈ సమయంలో ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.. నా భాగస్వామి శివోన్‌కు భార‌తీయ మూలాలు ఉన్నాయి.. ఆమెను దత్తత తీసుకున్నారు.. ఆ తర్వాత ఆమె కెనడాలో పెరిగిందని పేర్కొన్నాడు.

ఎలోన్ మస్క్ తన కొడుకులలో ఒకరి పేరులో 'శేఖర్' అనే పదం ఉందని కూడా చెప్పాడు. అతడికి ఇండో-అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త సుబ్రమణియన్ చంద్రశేఖర్ ప్రభావంతో ఈ పేరును పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. మస్క్ మాట్లాడుతూ.. "శివోన్ ద్వారా క‌లిగిన‌ నా కొడుకులలో ఒకరి పేరులో శేఖర్ అనే పదం ఉందని వెల్ల‌డించాడు.

ఎలోన్ మస్క్, శివోన్ జిలీస్‌లకు నలుగురు పిల్లలు. శివన్ జిలీస్‌ మస్క్‌కు చెందిన‌ న్యూరోటెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్. ఇద్దరూ చాలా కాలంగా రిలేష‌న్‌లో ఉన్నారు. వారిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు.

శివన్ జిలీస్ కెనడాలోని అంటారియోలో 1986లో జన్మించాడు. ఆమెకు కెనడా, అమెరికా రెండింటి పౌరసత్వం ఉంది. శివన్ యేల్ యూనివర్శిటీలో ఎకనామిక్స్ మరియు ఫిలాసఫీ చదివింది. ఆమె 2008లో బ్యాచిలర్ డిగ్రీని సంపాదించిన తర్వాత IBMలో తన వృత్తిని ప్రారంభించింది.

2016లో శివోన్ జిలీస్ ఓపెన్ AIలో భాగమయ్యింది. దీని సహ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్. ఓపెన్ AI డైరెక్టర్ల బోర్డులో చేరిన అతి పిన్న వయస్కురాలు శివోనే. ఆ సమయంలోను శివన్ ఎలోన్ మస్క్‌ని కలిసింది. దీని తర్వాత శివోన్ న్యూరాలింక్, టెస్లాలో చేరింది.

2017లో శివోన్ మస్క్‌కు చెందిన‌ న్యూరోటెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్‌లో చేరారు. ఈ కంపెనీ బ్రెయిన్ మెషీన్‌ను తయారు చేసే పనిలో ఉంది. తక్కువ సమయంలోనే శివోన్‌ న్యూరాలింక్ ప్రత్యేక ప్రాజెక్ట్‌కి డైరెక్టర్ అయ్యింది. 2023లో ఆమె షీల్డ్ AI బోర్డులో భాగమైంది. ఇది రక్షణ సాంకేతిక సంస్థ. ఇది విమానాలకు AIని జోడించే పనిలో ఉంది.

Next Story