శనివారం వీకెండ్ సందర్భంగా ఫ్లోరిడాలోని మయామి బీచ్‌లో ఈతగాళ్లు, సందర్శకులు ఏంజాయ్ చేస్తున్న వేళ.. అట్లాంటిక్ మహాసముద్రంలో ముగ్గురు ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కాగా ఈ ఘటనపై ఫెడరల్ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. రాబిన్సన్ ఆర్44 హెలికాప్టర్ మధ్యాహ్నం 1:20 గంటలకు రద్దీగా ఉండే బీచ్‌కు సమీపంలో సముద్రంలో కుప్పకూలింది. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో క్రాష్‌కు కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. విషయం తెలుసుకున్న మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలో హెలికాప్టర్ ఈతగాళ్లతో నిండిన సముద్ర ప్రాంతంలోకి దూసుకెళ్లింది.