మార్చి 1 నుండి.. H-1B వీసాల కోసం రిజిస్ట్రేషన్లు

H-1B visa registration for fiscal year 2023 from March 1 to 18. 2023 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్లు మార్చి 1న ప్రారంభమవుతాయి. మార్చి 23 వరకు కొనసాగుతాయి.

By అంజి  Published on  30 Jan 2022 2:30 PM GMT
మార్చి 1 నుండి.. H-1B వీసాల కోసం రిజిస్ట్రేషన్లు

2023 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసాల కోసం ప్రారంభ రిజిస్ట్రేషన్లు మార్చి 1న ప్రారంభమవుతాయి. మార్చి 23 వరకు కొనసాగుతాయి. US పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేసింది. ఆన్‌లైన్ H-1B రిజిస్ట్రేషన్ సిస్టమ్‌ని ఉపయోగించి రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేయాల్సి ఉంది.

అమెరికా ప్రతి ఏడాది 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటుంది. తాజాగా 2023 ఆర్థిక సంవత్సరం కోసం హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఇమ్మిగ్రేషన్ విభాగం తెలిపింది. ఆన్ లైన్ లో myUSICS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ దరఖాస్తు సమయంలో 10 డాలర్ల రుసుం చెల్లించాలి. గడువులోపల దరఖాస్తు చేసుకున్నవారికి అదృష్టాన్ని బట్టి హెచ్1బీ వీసాలు కేటాయిస్తారు. ఈ వీసాలు పొందేవారు అక్టోబరు నుంచి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు.

హెచ్1బీ వీసా తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చే వీసా. H-1B వీసా ప్రోగ్రామ్ కోసం చాలా మంది భారతీయులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ఈ వీసా ప్రోగ్రామ్ ద్వారా US కంపెనీలు భారతీయులను నియమించుకోవచ్చు. USలో అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 65,000 H-1B వీసాలు జారీ చేయబడతాయి. US మాస్టర్స్ డిగ్రీ హోల్డర్‌ల కోసం 20,000 వీసాలు రిజర్వ్ చేయబడ్డాయి. అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్ కంపెనీలకు సంబంధించి 2021 ఆర్థిక సంవత్సరంలో H-1B వీసాలు ఎక్కువగా ఇచ్చారు.

Next Story