తుపాకీతో సైకో స్వైరవిహారం.. న‌లుగురు మృతి.. మ‌రో ఘ‌ట‌న‌ కూడా..

Gun Fire In Florida. అమెరికన్‌ గ‌న్ క‌ల్చ‌ర్ తో రోజురోజుకు సైకోలు పేట్రేగిపోతున్నారు. విచ్చ‌ల‌విడిగా మ‌నుషుల‌ను

By Medi Samrat  Published on  6 Sep 2021 4:12 AM GMT
తుపాకీతో సైకో స్వైరవిహారం.. న‌లుగురు మృతి.. మ‌రో ఘ‌ట‌న‌ కూడా..

అమెరికన్‌ గ‌న్ క‌ల్చ‌ర్ తో రోజురోజుకు సైకోలు పేట్రేగిపోతున్నారు. విచ్చ‌ల‌విడిగా మ‌నుషుల‌ను పిట్ట‌ల‌ను కాల్చిన‌ట్లు కాల్చుతున్నారు. తాజాగా ఫ్లోరిడాలోని లేక్‌ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో స్వైరవిహారం చేయడంతో నలుగురు మృతిచెందారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ధరించిన సైకో జరిపిన కాల్పుల్లో లేక్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో 11 ఏళ్ల బాలిక, బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారు. పొరుగింట్లో మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది. సైకోపై కాల్పులు జరిపిన పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. కాల్పులకు కారణం ఏమిటన్నది తెలియాల్సివుంది.

మరో ఘ‌ట‌న‌ హూస్టన్‌లో జ‌రిగింది. ఆదివారం ఉదయం ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు 50 ఏళ్ల పెద్దలు ఉండ‌గా.. పిల్లలు 10-13 వ‌య‌సువారు. ఈ ఘ‌ట‌న‌లో కాల్పుల అనంతరం ఇల్లు తగలబడింది. స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాలను గుర్తించగా.. కాల్పుల విషయం వెలుగులోకి వ‌చ్చింది. ఘ‌ట‌న‌కు ముందు ఇంట్లో గొడవ జ‌రిగివుండొచ్చ‌ని భావిస్తున్నారు.


Next Story