మరో కరోనా వైరస్ వేరియంట్ కలకలం
govt warns for fresh Covid strains. కరోనా వైరస్ ప్రమాదం నుండి ప్రజలు తప్పించుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్
By Medi Samrat Published on 21 Oct 2021 11:24 AM GMTకరోనా వైరస్ ప్రమాదం నుండి ప్రజలు తప్పించుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ వచ్చిందనే వార్త కారణంగా మళ్లీ టెన్షన్ మొదలైంది. యూకే లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసుల పెరుగుదలపై పరిశోధనలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కరోనా మరో కొత్తరూపు తీసుకున్నట్టు వెల్లడైంది. యూకేలో డెల్టా వేరియంట్ ప్రభావం చూపిస్తూ వస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కరోనా కేసుల్లో 6 శాతం కేసులు డెల్టా వేరియంట్ జన్యుపరంగా అభివృద్ధి చెందిన మరో వేరియంట్ గా తేలింది. దీనిని అక్కడ డెల్టా ప్లస్ అని పిలుస్తున్నారు. ఈ వేరియంట్ శాస్త్రీయ నామం AY.4.2. పెట్టారు. ఈ వేరియంట్ వలన కలిగే ముప్పును అర్థం చేసుకోవడానికి పరీక్షలు జరుగుతున్నాయి. నిపుణులు దీనివలన పెద్దగ ఇబ్బంది లేదని అంటున్నారు.
ఈ కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌ను ప్రభావితం చేసే కొన్ని కొత్త ఉత్పరివర్తనాలను కలిగి ఉంటుందని అంటున్నారు. స్పైక్ ప్రోటీన్ వైరస్ మన కణాలలోకి చొచ్చుకుపోవడానికి ఉపయోగపడుతుంది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ జెనెటిక్స్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్లు మాట్లాడుతో ఇది స్వల్పంగా మరింత అంటువ్యాధి జాతి అని చెప్పారు. ఇంతకు ముందు చూసిన వేరియంట్లతో పోలిస్తే ఇది పూర్తిగా వినాశకరమైన వేరియంట్ కాదని అంటున్నారు. ఈ AY.4.2 ను ప్రస్తుతం యూఎస్ లో కొన్ని కేసులు గుర్తించారు. అదేవిధంగా డెన్మార్క్ లో కూడా కొన్ని ఉన్నాయి.